నవభారత్ న్యూస్...
** బొల్లారంలో కాంగ్రెస్ నాయకులు పై ప్రెస్*
* నవభారత ప్రతినిధి రవి.*
మీట్ హడావిడిగా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకోం*
*- మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి*
*- పనులు పూర్తి చేయండి, సహకరిస్తాం*
*- బొల్లారంలో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్*
అభివృద్ధి పనులు పూర్తికాకముందే హడావిడిగా శిలాఫలకాల ఏర్పాటు చేయడం సమంజసం కాదని బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి గారు అన్నారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. బొల్లారం మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగానే ఉన్న, హడావిడిగా పాలకవర్గం శిలాఫలకాల ఏర్పాటు చేయడానికి వ్యతిరేకించారు. మున్సిపాలిటీలోని బి.సి కాలనీ, ఐ.డి.ఏ బస్తి, లక్ష్మీ నగర్, జ్యోతి నగర్ తదితర కాలనీలలో పనులు అసంపూర్తిగానే ఉన్నాయని అన్నారు. ఉన్నటుండి వెంటనే శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని ఆలోచన సరైన విధానం కాదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులను పూర్తి చేశాకే శిలాఫలకాలు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామన్నారు. అందుకు తమ సంపూర్ణ మద్దతు కూడా ఉంటుందన్నారు. అలాకాకుండా అస్తవ్యస్తంగా పనులను పూర్తి చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని చూస్తే ఆందోళన కార్యక్రమాలకు సైతం దిగుతామని హెచ్చరించారు. ప్రజలు కూడా హర్షించరన్నారు. ప్రజా క్షేత్రంలో చేసే మంచి పనులు శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాయనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం'లో కౌన్సిలర్లు సుజాత గారు, గోపాలమ్మ గారు, కోప్షన్ మెంబర్ మునీర్ గారు, లక్ష్మా రెడ్డి గారు(ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షులు), స్థానిక నాయకులు సంపత్ రెడ్డి గారు, రమణయ్య గారు, రాష్ట్ర కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ కృష్ణంరాజు గారు, మాజీ వార్డ్ మెంబర్ భాస్కర్ గారు, చంద్రారెడ్డి గారు, చక్రపాణి గారు, పాండు గారు, రమేష్ రెడ్డి గారు, యువజన నాయకులు బషీర్ గారు, లక్కన్ గారు, ఇమ్రాన్ గారు, కార్యకర్తలు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.