" ఇంక సెలవు తమ్ముళ్లు ".
గుడ్లూరు: డిసెంబర్ 23 (నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్. ఆంజనేయులు )
----చెన్నై ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన టిడిపి సీనియర్ నాయకులు, పాజర్ల మాజీ సర్పంచ్ ఉమ్మడి పోలు కోటేశ్వరరావు.
గుడ్లూరు డిశంబర్ -23(నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్. ఆంజనేయులు ) గుడ్లూరు మండలం పాజర్ల గ్రామం మాజీ సర్పంచ్, టిడిపి సీనియర్ నాయకులు ఉమ్మడి పోలు కోటేశ్వరరావు గతకొంత కాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తెల్లవారి జామున తుది శ్వాస విడిచారు. ఈ సమాచారం పార్టీ వర్గీయులకు, గ్రామస్తులకు తీవ్ర విశాదం మిగిల్చింది.తన 32సంవత్సరాల రాజకీయ జీవితంలో వివాద రహిత నాయకులుగా గ్రామస్తులను సమన్వయంగా ముందుకు నడిపిన నాయకులుగా గుడ్లూరు, ఉలవపాడు మండలంల రాజకీయ వర్గీయులు అభివర్ణిస్తున్నారు. ఆయన మృతి టిడిపి పార్టీకి తీరని నష్టం అని, పార్టీ ఒక మంచి రాజకీయ అనుభవం కల్గిన నాయకుణ్ణి కోల్పోయింది అని గుడ్లూరు మండలం టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, (రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ )విచారం వ్యక్తం చే
శారు.