నవభారత్ న్యూస్....
*(రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి కార్యాలయం అమరావతి)*
*================*
*వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్*
*అజీజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న బోర్డు సభ్యులు*
*అబ్దుల్ అజీజ్ ను చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల*
*వేగంగా బోర్డు ఏర్పాటు ప్రక్రియ పూర్తిచేసిన మంత్రి ఫరూక్*
*అమరావతి డిసెంబర్ 17*
====================
*ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా నెల్లూరుకు చెందిన మాజీ మేయర్, టీడీపీ నాయకుడు అబ్దుల్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.* *మంగళవారం ప్రభుత్వం చేత నియమించబడిన వక్ఫ్ బోర్డు సభ్యుల మొదటి సమావేశం జరిగింది. బోర్డు సభ్యుల మొదటి సమావేశంలోనే చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.*
*వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేస్తామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మంత్రి ఫరూక్ నేతృత్వంలో వక్ఫ్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశారు.*
*గత ప్రభుత్వ హయాంలో జారీ కాబడిన మైనారిటీ సంక్షేమ శాఖ వక్ఫ్ బోర్డు జీవో -47 ను ఉపసంహరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ జీవో-75 విడుదల చేసిన విషయం విధితమే.21.10.2023 న అప్పటి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నామినేట్ చేయబడ్డ సభ్యుల నియామకాల తీరుపై కొందరు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ, వివిధ రకాల న్యాయపరమైన సమస్యల తలెత్తిన కారణంగా అప్పటి నుంచి వక్ఫ్ బోర్డులో పరిపాలన శూన్యత ఏర్పడింది.* *ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించడం,* *రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్*
*నేత్రుత్వంలో కార్యాచరణ చర్యలు వేగవంతం చేయడం జరిగింది.* *ఇందులో భాగంగా*
*కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పదమైన జీవోను రద్దు చేస్తూ నూతనంగా జీవో నెంబర్ 75 ను ప్రభుత్వం జారీ చేసింది.*
*తదనంతరం వక్ఫ్ బోర్డు సభ్యులను నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం నియమించడం జరిగింది.* *బోర్డు సభ్యుల మొదటి సమావేశం వక్ఫ్ బోర్డు కార్యాలయంలో జరిగింది. నిబంధనలకు అనుగుణంగా బోర్డు సభ్యులందరూ వారిలోని సహచర సభ్యుడిని చైర్మన్ గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా అబ్దుల్ అజీజ్ ను చైర్మన్ గా బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోర్డు సభ్యుల నిర్ణయం మేరకు అబ్దుల్ అజీజ్ ను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో చేసింది.వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు పరిరక్షణ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని,గత కొద్ది నెలలుగా వక్ఫ్ బోర్డు లో నిలిచిపోయిన పరిపాలన శూన్యత పై దృష్టి సారించి చర్యలు చేపట్టి, నియమ నిబంధనలకు అనుగుణంగా వక్ఫ్ బోర్డు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని అక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడం, ఉన్న భూములను పరిరక్షించుకోవడం పై కొత్త బోర్డు కు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన బాధ్యతలు అప్పజెప్పినట్లు మంత్రి తెలిపారు.*