అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని లాగా ఉంది

NavaBharath News Kandukur
0

 ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరు విడుదల చేసి రాళ్లపాడు రైతాంగాన్ని ఆదుకోవాలి. 

-------సిపిఎం డిమాండ్ 

------- అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని లాగా ఉంది


రాళ్లపాడు రైతాంగ దుస్థితి. సిపిఎం ఎద్దేవా 

కందుకూరు: డిసెంబర్ 16 (నవభారత్ న్యూస్ రిపోర్టర్ )

రాళ్లపాడు రైతాంగం వరి నారు ఎండిపోకుండా ఫైర్లు వేసుకోవడానికి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరు అందించాలని సిపిఎం పార్టీ గుడ్లూరు , కందుకూరు ఉలవపాడు ఏరియా కార్యదర్శులు, జి వెంకటేశ్వర్లు, ఎస్ ఎ గౌస్, జి వి కుమార్ ఒక ప్రకటనలో, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో 20 అడుగులు నీళ్లు ఉన్నప్పటికీ, పొలాల్లోకి చుక్కనీరు రాని కారణంగా, నార్లు వెండి పోతూ, టైర్లు వేసుకోలేకపోతున్నామని రైతులు విలవిలలాడిపోతున్నారని, అంగట్లో అన్నీ ఉన్నా అల్లూరు నోట్లో శని ఉన్న సామెత, రాళ్లపాడు రైతాంగానికి వర్తిస్తుందని, నాయకులు ఎద్దేవ చేశారు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెంటనే రాళ్లపాడు రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రాజెక్టు రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని సిపిఎం పేర్కొంది. గత వారం రోజుల నుండి, గేట్లు విరిగిపోయిన కారణంగా, కుడి కాలవలో నీరు పారుదల లేక, రైతులు ఫైర్లు వేసుకోలేక అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని సిపిఎం పేర్కొంది. రైతులు ఫైర్లు వేయకముందే, గేట్లకి మరమ్మత్తులు చేయించుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ప్రభుత్వం మీద ఉంది. నాట్ల తరుణంలో ఇలాంటివి ,పరిశీలన చేయటం అంటే, రైతాంగం పట్ల అధికారులకు పాలకవర్గాలకు చిత్తశుద్ధి లోపించింది అనేది అర్థం అవుతుంది., ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, గేట్లు ఎత్తటానికి, రాష్ట్రంలోని నిపుణులను రప్పించి మరమ్మత్తుల చేయించాలని, అప్పటి దాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఈ కాలం ద్వారా నీరు అందించి, ఫైర్లు ఎండిపోకుండా రాళ్లపాడు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ నియోజకవర్గ నాయకులు, ముప్పరాజు కోటయ్య, జి. వెంకటేశ్వర్లు, ఎస్. ఎ.గౌస్, జీవి.బి. కుమార్, మాదాల రమణయ్య, మద్దిశెట్టి జాలయ్య, ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేకుంటే రెండు మూడు రోజుల్లో ప్రాజెక్టు కార్యాలయం వద్ద రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top