కొత్త పేట గ్రామంలో "వైరల్ జ్వరాలు "
------ అప్రమత్తమైన మండల అధికారులు.
----యుద్ధ ప్రాతిపధికన వైద్యశిబిరం ఏర్పాటు.
-----గ్రామ వీధుల్లో క్లోరినేషన్ ప్రక్రియ.
----కొత్త పేట గ్రామంను సందర్శించిన ఎంపిడిఓ వై. వెంకటేశ్వరరావు.
గుడ్లూరు డిశంబర్ -19(నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్. ఆంజనేయులు ) గుడ్లూరు మండలం పరిధిలోని కొత్త పేట గ్రామంలో వైరల్ జ్వరాలు అధికంగా ఉన్నాయన్న గ్రామస్తుల ఫిర్యాదుతో ఎంపీడీవో వై. వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు గుడ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎంపిడిఓ వై.వెంకటేశ్వరరావు గురువారం పరిశీలించడమైనది. గ్రామ వీధులలో తిరిగి దగ్గరుండి కార్మికుల చేత బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.దోమలు నివారణ కు సాయంత్రం ఫాగింగ్ నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడమైనది అని ఎంపిడిఓ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నా
రు.