నవభారత్ న్యూస్...
*జిల్లాలో పౌరుల మిస్సింగ్ డేటాను హౌస్ హోల్డ్ సర్వే ద్వారా సేకరించండి...*
* ప్రతి పౌరుని వివరాలు గృహ డేటాబేస్ లో చేర్చండి...
* గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరును నమోదు చేయాలి...
* జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.
జిల్లాలో చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేసి పౌరుల మిస్సింగ్ డేటాను గృహ డేటాబేస్ లో చేర్చాలని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది హాజరును తప్పక నమోదుచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ సర్వే ప్రగతిపై బుధవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుండి మండల అభివృద్ధి అధికారులు గ్రామ వార్డు సచివాలయ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పౌరునికి సంబంధించిన సమగ్ర సమాచారం గృహ డేటాబేస్ లో పొందుపరచేందుకు హౌస్ హోల్డ్ సర్వేను నిర్వహించడం జరుగుతుందన్నారు. దారిద్యరేఖకు దిగువున ఉన్నవారు సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్నవారు డేటాబేస్ లో నమోదుచేయబడ్డారని ఉద్యోగస్తులు వ్యాపార రంగానికి చెందిన వారు దారిద్య్రరేఖకు పైబడినవారు సంక్షేమ పథకాలు అర్హులంకామనే ఉద్దేశంతో వారి వివరాలను మ్యాప్పింగ్ చేసుకోలేదన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిదిలోని ప్రతిఇంటిని సందర్శించి కుటుంబ యజమానితో పాటు సభ్యుల వివరాలను సేకరించి నమోదుకాని వారి డేటాను పొందుపరచాలన్నారు. ప్రతిఇంటికి జియో కో ఆర్డినేటర్ల అవసరం ఉందని పౌరులకు సేవలందించేందుకు జియో టాగింగ్ తప్పనిసరని జిల్లాలో 7,28,383 గృహలకుగాను 6,91,627 గృహలు జియో టాగింగ్ చేయడం జరిగిందన్నారు. మిగిలిన 36,756 జియో టాగింగ్ చేయాలన్నారు. అర్హతకలిగిన లబ్దిదారులకు సామజిక ప్రయోజనాలను అందించేలా వారి ఆధార్ ను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ తప్పనిసరిగా హాజరును నమోదు చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారిణి జి. జ్యోతి, జిల్లాకు చెందిన మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
...........................................డీఐపీఆర్వో, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వారిచే జారీ చేయడమైనది