రాష్ట్రవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలు యూనిఫామ్ గా

NavaBharath News Kandukur
0

 నవ భారత ప్రతినిధి రవి )


రాష్ట్రవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలు యూనిఫామ్ గా ఉండే విధంగా అన్ని హాస్టల్స్ లో ఒకే విధమైన ఆహారం అందజేసే డైట్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గార్లు తెలిపారు.


శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే వసతి గృహంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పరిశ్రమల & IT శాఖల మంత్రి శ్రీధర్ బాబు, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తో కలిసి నూతన డైట్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


*వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ* మాట్లాడుతూ.. యావత్ రాష్ట్రంలో అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు డైట్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. పిల్లలు ఎదగాలి, శారీరకంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలను పెంచినట్లు తెలిపారు. నెలకు ఆరుసార్లు మాంసాహారంతో కూడిన ఆహారంతో పాటు మెనూలో మార్పు తీసుకురావాలని 10 సంవత్సరాల తర్వాత 40% డైట్ చార్జీలు 200% కాస్మొటిక్ చార్జీలును ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. మన పిల్లలు చదువుతున్నారని ఆ పిల్లలు సురక్షితంగా ఆరోగ్యవంతంగా ఉండాలని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని, బలవర్ధకమైన ఆహారం అందించాలని ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్యను, హాస్టల్ సౌకర్యాలు, భోజన సౌకర్యాలు మేలైన రీతిలో కల్పించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. వైద్యానికి సంబంధించి పేదవాళ్ళు అప్పులపాలు కాకుండా మెరుగైన వైద్య సేవల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాముఖ్యమైనదిగా భావించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్, అధికారులు వసతి గృహాలకు వెళ్లి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి సౌకర్యాలు పరిశీలిస్తున్నారని అన్నారు. డైట్ లో ఏ విధమైన మార్పు వచ్చిందో పరిశీలించాలని, ఈ మార్పు భవిష్యత్తులో కూడా కొనసాగాలని ప్రతి తల్లిదండ్రులకు ఆకాంక్ష ఉంటుందని, తల్లిదండ్రులకు పిల్లలే బలమని ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాల పిల్లలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రులు మీకున్న సౌకర్యాలు, భోజన వసతులు పిల్లలకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. అధికారులు తరచుగా హాస్టళ్లు తనిఖీ చేస్తూ విద్యా, సౌకర్యాలు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.


ఈ సందర్భంగా

హాస్టల్లో ఉంటున్న విద్యార్థినిలకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. మన ఆరోగ్యం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుండాలని అనేక కార్యక్రమాలు చేపడతున్నామని తెలిపారు.


ఈ సంధర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ప్రభుత్వం చదువుకు, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బాగా చదువుకోవాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు. మేము చదువుకోలేకపోయిన మా పిల్లలు బాగా చదవుకుంటున్నారని, భవిష్యత్తులో పెద్ద ఉద్యోగాలు సాధిస్తారని ఆశతో ఉన్నారని తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం పిల్లల బంగారు భవిష్యత్తుకు ఆలోచన చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుతోపాటు ఆహారానికి సంబంధించిన విషయంలో నాణ్యత తక్కువ కాకుండా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ గా డైట్ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. పౌష్టికాహారానికి సంబంధించి గడిచిన పది సంవత్సరాల కాలంలో డైట్ చార్జీలు పెంచలేదని తెలిపారు. గత డైట్ చార్జీలకు కూరగాయలు, పాలు, నిత్యావసర వస్తువులు మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచలేదని కానీ తమ ప్రభుత్వం పిల్లలు ఉజ్వల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. విద్యా, వైద్యం తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను అందుబాటులోకి తెచ్చి విద్యార్థులు అందరూ ఒకటే దగ్గర చదువుకునే విధంగా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. ప్రవేటు పాఠశాలలో లేని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి చదువు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కాంప్రమైస్ కాకుండా అన్ని సౌకర్యాలు కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తల్లిదండ్రులు కష్టపడి కూలి, వ్యవసాయ పనులు చేకుంటున్నారని, పిల్లలు హాస్టల్లో ఉంటే ప్రభుత్వ చూసుకుంటుందని నమ్మకం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ తాపత్రయం పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని తెలిపారు.


 ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ జరుగుతుందని, అధికారులు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్లక్ష్యం, నిర్లప్తత అనే పదాలు లేకుండా ప్రభుత్వ అధికారులు రాజీలేకుండా పనిచేస్తారని ఆయన సూచించారు.

 ఇచ్చిన వాగ్దానాల మేరకు అన్ని మార్పులు తీసుకొస్తున్నామని మార్పు చూపెడతామని చెప్పామని అలాగే మార్పు చూపెడుతున్నామని, భవిష్యత్తులో కూడా అనేక మార్పులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని తెలిపారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసామని విద్యార్థులు ఇంగ్లీష్ లో చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారని భవిష్యత్తులో మంచి అధికారులుగా, శాస్త్రవేత్తలుగా ఐఏఎస్ అధికారులుగా తయారు కావాలని ఆయన సూచించారు.


శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు డైట్ చార్జీలు 40% పెంచినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఉండేవిధంగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విద్యార్థులతో భోజనం చేసి నూతన డైట్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గత 10 సంవత్సరాలు డైట్ చార్జీలు పెంచకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కాస్మోటిక్ చార్జీలను రెండు వందల శాతం పెంచినట్లు తెలిపారు. పిల్లలు భవిష్యత్తు కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చార్జీ లు పెంచడమే కాకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రాబోవు తరాల తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం సహకారాలు కల్పిస్తున్నట్లు తెలిపారుల. గత పది సంవత్సరాల్లో పెంచినటువంటి చార్జీలను తమ ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యార్థుల తరుపున అభినందనలు తెలి పారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి శైలజ, ఆర్డీవో మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top