నవభారత్ న్యూస్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్
హైదరాబాద్. నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.
నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్లు నిన్న ఇంటిపై దాడి చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఆరుగురిని ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు వనస్థలిపురంలోని జడ్జి నివాసంలో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు.