నవభారత్ న్యూస్
*తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి బంగారు కిరీటం విరాళం*
తిరుపతికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఆదివారం బంగారు కిరీటం విరాళంగా అందింది.
చెన్నైకి చెందిన శ్రీమతి వసంత లక్ష్మి, ఆమె కుమార్తె శ్రీమతి మాధవి, అల్లుడు శ్రీ మనోహర్ లు రూ.27 లక్షల విలువైన 341 గ్రాముల బంగారు కిరీటాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కానుకగా సమర్పించారు.
ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ముని బాల కుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ డి కృష్ణమూర్తి, అసిస్టెంట్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు శ్రీ గోపాల భట్టార్, శ్రీ కృష్ణ ప్రసాద్ భట్టార్, శ్రీ గోకుల్, శ్రీ అనిల్ కుమార్ విరాళాన్ని స్వీకరించారు.
దర్శనానంతరం దాతలకు పండితులు వేదశీర్వచనం చేశారు.
----------------------------------------
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.