**వైభవంగాఅయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు **

NavaBharath News Kandukur
0


నవభారత్ న్యూస్....


 **వైభవంగాఅయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు **



° భారీ సంఖ్యలో హాజరైన భక్తులు°


° ఆకట్టుకున్న అయ్యప్ప స్వామి ఆటపాటలు °


 నవభారత ప్రతినిధి రవి.



  ( డిసెంబరు 18 ) అందోల్ .  


సంగారెడ్డి జిల్లా: జోగిపేట

 

పట్టణంలోని నిన్న మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం వద్ద నుంచి అయ్యప్ప దేవాలయం వరకు అయ్యప్ప స్వామి. ఆభరణాల.ఊరేగింపు వైభవంగా సాగింది. గురుస్వాములు దేవరశెట్టి. సంతోష్ కుమార్. పులుగు గోపాలరావు ఆధ్వర్యంలో. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు.చేసిన అనంతరం. అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో స్వామి వారి ఆభరణాలు స్వామివారి పల్లకి సేవను ఊరేగింపుగా నిర్వహించారు. ఊరేగింపులో గురు స్వాములు పాడిన అయ్యప్ప భక్తి పాటలకు పట్టణమంతా మారుమోగింది. ఈ ఊరేగింపును తిలకించేందుకు వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. రాజరాజేశ్వరి దేవాలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు. క్లాక్ టవర్. వీర హనుమాన్ దేవాలయం. ముత్యాలమ్మ దేవాలయం. పద్ధతి హనుమాన్.బసవేశ్వర చౌరస్తా మీదుగా. అయ్యప్ప దేవాలయం వరకు ఊరేగింపు కొనసాగింది. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ఆభరణాలతో అలంకరించారు.జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్.కోర బోయిన నాగరాజు ( నాని)అయ్యప్ప ఆలయం వద్ద. భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గురు స్వామి పులుగు గోపాలరావు. భక్తులందరికీ అల్పాహారం అందజేశారు. *ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ* ఆభరణాల ఊరేగింపు అనంతరం హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న. అయ్యప్ప స్వామి ఆలయం వద్ద. రాత్రి 7 గంటలకు. గురు స్వామి పులుగు గోపాలరావు ఆధ్వర్యంలో. నిర్వహించిన అయ్యప్ప స్వామి మెట్ల పడిపూజ ఘనంగా జరిగింది. అయ్యప్ప భక్తి పాటలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రత్యేకంగా ఈ ఊరేగింపులో అయ్యప్ప స్వామి డీజే పాటలతో ఎంతో ఆకట్టుకున్నాయి ఈ పడిపూజలో అయ్యప్ప స్వాములు. భక్తులు ప్రజా ప్రతినిధులు. పెద్ద సంఖ్యలో పాల్గొని. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top