తెలుగు యువత,సభ్యత్వ నమోదు కార్యక్రమ సమావేశం

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 

నవభారత ప్రతినిధి రవి.



ఈ రోజు దుబ్బాక లో ఆర్యవైశ్య భవన్ లో పార్లమెంట్ టిడిపి కన్వీనర్ ఇళ్లేందుల రమేష్ గారి అధ్యక్షత న మెదక్ పార్లమెంటు కమిటీ తెలుగు యువత,సభ్యత్వ నమోదు కార్యక్రమ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగారాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు డాక్టర్ పొగాకు జయరాం చందర్ గారు హాజరయ్యారు.సమావేశం లో పొగాకు జయరాం చందర్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని ,తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ అని తెలిపారు.తెలుగు దేశం పార్టీ సభ్యత్వ నమోదు లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగాపిలుపునిచ్చారు. తెలంగాణా ను అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ అని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి యువత లో నైపుణ్యం ను పెంచి రాష్ట్రంలో హైటెక్ సిటీ ని కట్టి విప్రో, మైక్రోసాప్ట్ ,ఎన్నో పదుల సంఖ్యలో ప్రతిష్ఠాత్మక కంపెనీలను తీసుకువచ్చి లక్షల జీతాల తో యువత కు అందులో ఉపాధి కల్పించి వారి కుటుంబాలలలో గణనీయంగా మార్పులు తీసుకువచ్చిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా తెలిపారు. మెదక్ పార్లమెంట్ టిడిపి కన్వీనర్ ఇళ్లేందుల రమేష్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో నే పేదలు బాగుపడ్డారని,ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా స్వర్గీయ ఎన్టీఆర్ గారు,మరియు నారా చంద్రబాబునాయుడు గారు తెలంగాణ ను అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్ఠాత్మిక కంపెనీలు తెచ్చి లక్షల మంది యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపించారని తెలిపారు.ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేద,మధ్యతరగతి ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించారు అని తెలిపారు.పేదప్రజలు ,యువత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు లో పాల్గొనాలని తెలిపారు. రాష్ట్ర తెలుగుయువత నాయకులు కర్ణంపల్లి రూపేష్ రెడ్డి గారు మాట్లాడుతూ యువత కు తెలుగుదేశం పార్టీ మీ విడదీయరాని సంబంధం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.సభ్యత్వ నమోదు లో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ సమావేశములో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు పొగాకు జయరాం చందర్ గారు,మెదక్ పార్లమెంటు టిడిపి కన్వీనర్ ఇళ్లేందుల రమేష్ గారు,రాష్ట్ర తెలుగు యువత నాయకులు కర్ణంపల్లి రూపేష్ రెడ్డి గారు,పార్లమెంట్ ఆడహక్ కమిటీ సభ్యులు,అశోక్ గుప్తా గారు,దమ్ము యాదగిరి గౌడ్ గారు,జనార్దన్ గారు,పెరుడి వెంకట్ రెడ్డి గారు,ఆకుల రాములు గారు,ర్యాకాం రవీందర్ గారు, రమేశ్ గౌడ్ గారు,పెంబర్తి భాస్కర్ గారు ,జహంగీర్ గారు,నర్సింలు గారు,లింగం గారు,ఎల్లయ్య గారు,గణేష్ గారు ,శ్రీకాంత్ గారు,రామ్ గోపాల్ గారు,చంద్రారెడ్డి గారు,రమేష్ గారు,నగేష్ గారు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top