నవభారత్ న్యూస్
*వెయ్యి గొంతులు - లక్ష డప్పులు' మహా కళా ప్రదర్శన విజయవంతం చేయండి*
.....- డప్పోల్ల రమేష్
రాష్ట్ర కో ఆర్డినేటర్ & ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి.
*వర్గీకరణ అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి*
......పల్లె సంజీవయ్య
దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు
(నవభారత ప్రతినిధి రవి.)
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోరుతూ మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు పిబ్రవరి 03.02.2025 న హైదరాబాదులో జరుపతలపెట్టిన 'వెయ్యి గొంతులు - లక్ష డప్పులు' మహా ప్రదర్శన విజయవంతం చేయాలని ' *వెయ్యి గొంతులు - లక్ష డప్పులు*' కార్యక్రమ రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి డప్పోల్ల రమేష్ మాదిగ కోరారు. ఆదివారం సింగూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాదిగ జాతి బిడ్డలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. పార్టీలకు, సంఘాలకు అతీతంగా ప్రతి గ్రామం నుండి మాదిగలు, ఎమ్మార్పీఎస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు సంకన డప్పు వేసుకుని హైదరాబాద్ తరలి రావాలన్నారు. కవులు కళాకారులు విద్యావంతులు నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా జనవరి మూడవ తారీఖు నుండి ఫిబ్రవరి మూడు వరకు నెల రోజుల పాటు రథయాత్ర నిర్వహిస్తామన్నారు.
ముప్పై ఏళ్ల దండోరా పోరాటం ఫలితంగా ఆగస్టు ఒకటిన భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ద్వారా వర్గీకరణ పోరాటం విజయం సాధించిందని అన్నారు. వర్గీకరణ అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ లేకుండా జరిగిన ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాల్లో తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పల్లె సంజీవయ్య, ఈ కార్యక్రమం లో చౌటకూర్ కృష్ణ, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు, నాగిరెడ్డిపల్లి కృష్ణంరాజు, జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య, *మాదిగ జర్నలిస్టు ఫోరం ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి దేవరంపల్లి అశోక్ మాదిగ*, ప్రముఖ రచయితలు సొన్నాయిల బాలరాజు, అమృత్ బండారి, కోవూరి నర్సింలు మరియు ఎమ్మార్పీఎస్ చౌటకూర్ మండల ఇంచార్జి ఎర్రోళ్ల రమేష్, భూమక్కోల్ల లింగం, శివన్నోల్ల గణపతి, నాగులపల్లి శ్రీహరి, ఏర్పుల రాజేందర్, శ్రీకాంత్, శ్రావణ్, బొర్రా లక్ష్మన్, బురుకల శివకుమార్, దిగంబర్, డి.అశోక్, తదితరులు పాల్గొన్ని ప్రసాంగించారు.
అనంతరం వెయ్యి గొంతులు - లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన పుల్కల్, చౌటకూరు మండలా కమిటీ ల ఇంచార్జ్ లను ఏకగ్రీవంగా ఏనుకోవడం జరిగింది. పుల్కల్ మండల్ ఇంచార్జ్ లుగా భూమాక్కొల్ల లింగం శివాన్నోళ్ల గణపతి, చౌటకూరు మండల్ ఇంచార్జ్ లుగా నాగులాపల్లి శ్రీహరి, ఎర్పుల రాజేందర్ లను ఏనుకోవడం జరిగింది.