నవభారత్ న్యూస్
*అమరావతి :*
*ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్*
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో (2 సెంట్లు) ఇల్లు కట్టుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది.
అలాగే 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునే వారికి అనుమతులు సులభతరం చేయనుంది.
కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.4లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.