నవభారత్ న్యూస్......
సీఎం రేవంత్ రెడ్డిని నివాసం లో కలసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయన తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్
హైదరాబాద్ నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.
సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కూడా ఉన్నారు.
సంజయ్ గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే.. సడెన్ గా సంజయ్ తో కలిసి అర్వింద్ రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశాడనే అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజమాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోనే జగిత్యాల నియోజకవర్గం ఉంది. ఈ నేపథ్యంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వీరు సీఎంను కలిశారా? లేకుంటే రాజకీయ అంశాలు ఏమైనా? ఉన్నాయ అంశంపై చర్చ సాగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఇంకా ఈ అంశంపై స్పందించలేదు.