" అమరజీవి వర్ధంతికి ఘననివాళి. "
------కార్యక్రమునకు విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరా రావు గుడ్లూరు డిశంబర్ -15(నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్. ఆంజనేయులు ) గుడ్లూరు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం అమరజీవి శ్రీ పొట్టి రాములు వర్ధంతిని పురస్కరించుకొని బస్టాండ్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు నియోజకవర్గం ఆర్యవైశ్య అధ్యక్షులు మోదడుగు వెంకటేశ్వర్లు హాజరయ్యారు .అలాగే కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు విచ్చేసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు అమర హై పొట్టి శ్రీరాములు అమరహై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు ఆత్మ శాంతి కోసం నాయకులు ప్రజా ప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమానికి గుడ్లూరు ఎంపీడీవో వై .వెంకటేశ్వరరావు, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనిగర్ల నాగరాజు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పాలకీర్తి శంకర్, ఆర్యవైశ్య గుడ్లూరు మండల అధ్యక్షులు కొత్తూరు శ్రీనివాసులు, టిడిపి ఆర్యవైశ్య మండల అధ్యక్షులు అమరా మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి యిన్నమూరి గరటయ్య, గుడ్లూరు మండలం బిజెపి అధ్యక్షులు యిన్నమూరి ప్రమీల సుధాకర్,తెలుగుదేశం పార్టీ నాయకులు పువ్వాడి చిన్న వేణు, మేకపోతుల రాఘవులు, రావూరి వేణు, మహిళా మండలి అధ్యక్షురాలు జొన్నలగడ్డ రవణమ్మ,గుడ్లూరు మండల తెలుగు యువత అధ్యక్షులు చెన్నారెడ్డి మహేష్, మేకలమాల్యాద్రి,గుడ్లూరు ఎస్.ఐ. వి. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.