వికలాంగుల కళాకారులకు సమాన అవకాశాలు కల్పించాలి*

NavaBharath News Kandukur
0


నవభారత్ న్యూస్ 

*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


పత్రిక ప్రకటన 21.12.2024


*వికలాంగుల కళాకారులకు సమాన అవకాశాలు కల్పించాలి*


*వికలాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి* 


*సాంస్కృతిక ఉత్సవాల్లో తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ఆనందచారి* 



వికలాంగుల కళాకారులను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,సమాన అవకాశాలు కల్పించి వికలాంగుల కళాకారులను ముందుకు తీసుకువెళ్లాలని తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ ఆనందచారి అన్నారు.

   *ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, LIC సౌజన్యంతో వికలాంగుల రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ అధ్యక్షతన జరిగాయి.వికలాంగుల కళాకారులూ చేసిన నృత్యలు, పాటలు, డాన్స్, మిమిక్రి ఆకట్టుకున్నవి*.

    *ఈ సందర్బంగా ఆనంద చారి మాట్లాడుతూ* సకలాంగులకు దిటుగా వికలాంగులు ముందుకు వస్తున్నారని అన్నారు. వికలాంగుల్లో ఉన్న ఆత్మవిశ్వాసం చాలా గొప్పదని అన్నారు. వైకాల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని అన్నారు.సామజిక అసమానతలపై వికలాంగులు చైతన్యం కావాలని అన్నారు.స్టిఫెన్ హాకింగ్ అంగవైకల్యం ఉన్న ప్రపంచంలోనే ఉన్నత శ్రేణి శాస్త్ర వేత్త అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక సారధిలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ఆలోచనలు చేయలేని వల్లే నిజమైన వికలాంగులని అన్నారు. వైకాల్యం ఉందని కుంగిపోకూడదని, పట్టుదలతో అంగవైకాల్యాన్ని అదిగమించాలని అన్నారు.శ్రమా నుండే పాట పుట్టిందని అన్నారు.పాటలు వికలాంగులలో చైతన్యం నింపాలని అన్నారు.

*NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ* ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్బంగా గత 10 సంవత్సరాలనుండి నుండి ప్రతి ఏటా వికలాంగులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.వికలాంగులైన కళాకారులను ప్రోత్సాహించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తుంటే, వారిని ప్రోత్సాహించేందుకు వికలాంగులతో ఆట పాట, సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వైకల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని అనేక మంది వికలాంగులు అయినా కళాకారులూ నిరూపించారాని అన్నారు. అవకాశాలు కల్పిస్తే వికలాంగులు ఏదైనా సాధిస్తారని అన్నారూ.వికలాంగులకు సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు, పెన్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక సారథి ఉద్యోగాల్లో వికలాంగులకు 5శాతం ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమలను ప్రచారం చేసి కార్యక్రమలలో వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు వికలాంగులకు అవకాశాలు కల్పించాలని అన్నారు.

*LIC ఆఫీసర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ* వికలాంగులు అట పాటలతో పాటు ఉన్నత చదువులు చదవాలని అన్నారు. చదువే సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందని అన్నారు. వికలాంగులను ఆదుకునేందుకు LIC నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

     ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, NPRD మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ సాయమ్మ, NPRD సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎరపుల జంగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షలు యశోద, దశరథ్, ఉపేందర్,స్వామి, లింగన్న , సహాయ కార్యదర్శులు కొనింటి నర్సిములు, యేశాల గంగాధర్,బాలిశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి శశికల,ప్రకాష్, శేఖర్ గౌడ్, దుర్గ, చంద్రమోహన్, లలిత,బాలయ్య, సుల్తాన్ రమేష్,లతో పాటు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


*ఆర్ వెంకటేష్* 

రాష్ట్ర కోశాధికారి
 

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top