నవభారత్ న్యూస్.....
సాంబశివ పిరమిడ్ సెంటర్లో జగదీష్ మాస్టర్ వర్ధంతి
*(నవభారత ప్రతినిధి రవి *)
వేడుకలకు హాజరైన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా, పుల్కల్ మండల్ సింగూర్ ప్రాజెక్టుకు సమీపంలో గల సాంబశివ పిరమిడ్ సెంటర్లో పిరమిడ్ మాస్టర్ జగదీష్ వర్ధంతి వేడుకలను పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి హాజరైన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ధ్యానం అనేది సర్వస్వం అదే ప్రతి పిరమిడ్ మాస్టర్ను ఏకతాటిపై నడిపిస్తూ సత్య యుగం మార్పుకై నాంది పలుకుతుందని పిరమిడ్ మాస్టర్ జగదీష్ గారి వర్ధంతి వేడుకల సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు తెలియజేశారు. ఈ సందర్భంలో సాంబశివ పిరమిడ్ మాస్టర్ ల సమక్షంలో స్వర్గస్తులైన పిరమిడ్ మాస్టర్ జగదీష్ గారి తండ్రిగారు భీమప్ప గారు శాలువాలతో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్, కాటేస్తేడ్ ఎమ్మెల్యే, ఎంపీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారిని ఘనంగా సన్మానించారు అదేవిధంగా సాంబశివపిరమిడ్ మాస్టర్లను సన్మానిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వివిధ జిల్లాల, మండలాల పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.