ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళన పై కలెక్టర్ స్పదించారు.

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్....

ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళన పై కలెక్టర్ స్పదించారు.


( నవభారత రిపోర్టర్ రవి)


*  జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాలతో విద్యార్థులతో చర్చలు జరుపుతున్న అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ . 

సంగారెడ్డి, డిసెంబర్ 21:-అందోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారంటూ పాఠశాల విద్యార్థుల ఆందోళన చేపట్టారు.  విషయం తెలుసుకున్న   జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు  వెంటనే పాఠశాలకు వెళ్లి విద్యార్థుల సమస్య పరిష్కరించాలని ఆదేశించడంతో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్  సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో చర్చలు జరిపారు. కలెక్టర్ ద్రుష్టి కి తీసుకెళ్లి విద్యార్థుల సమస్య పరిష్కారం  అయ్యేలా  చూడనున్నట్లు వారు విద్యార్థులకు హామీ ఇచ్చారు.

వెంట అందోల్ ఆర్డిఓ పాండు, టౌన్ సీఐ అనిల్ కుమార్, తహసీల్దార్ విష్ణు సాగర్ లు వున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top