"శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప దీక్షధారులు "
---- మేళతాలలతో, అయ్యప్ప నామ స్మరణతో భక్తి శ్రద్దలతో ఇరుమూళ్లు ధరించి ఉత్సహంతో తరలి వెళ్లిన స్వాములు.
గుడ్లూరు డిశంబర్ -15(నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్. ఆంజనేయులు )
గుడ్లూరు మండల కేంద్రంలో ఆదివారం అయ్యప్ప దీక్ష దారుణ చేసిన స్వాములు తమ దీక్ష కాలాన్ని భక్తిశ్రద్ధలతో నిష్టా నియమాలతో పూజా కార్యక్రమాలతో నిరంతర అయ్యప్ప స్వామి నామస్మరణతో భజనలతో పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని తమ ఏడూ వారాల దీక్షను పూర్తిచేసుకుని గురుస్వాముల ఆధ్వర్యంలో కటోర నియమాలతో దీక్షా కాలాన్ని పూర్తిచేసుకుని ఆదివారం ఇరుముళ్ళు ధరించి దాదాపు 70 మందికి పైగా అయ్యప్ప దీక్ష దారులు శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనార్థం ఉత్సాహంగా గ్రామంలో మేళ తాళాలతో అయ్యప్ప స్వామి నామ స్మరణతో స్వాములు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో స్వాములను కుటుంబ సభ్యులు బంధుమిత్రులు దగ్గరుండి శబరిమలై శబరిమల యాత్రకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సులకు ఎక్కించి స్వాములకు క్షేమంగా అయ్యప్ప స్వామి దర్శనాన్ని పూర్తిచేసుకుని తిరిగి రావాలని కోరుతూ సినిమా హాల్ సెంటర్ దాక తోడుగా వెళ్లి వీడ్కోలు పలికి వచ్చారు. ఈ కార్యక్రమం గ్రామంలో కనులు పండుగగా స్వాములు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్వాములకు గ్రామస్తులుపండ్లు పంపిణీ చేశారు
.