* **మంజీరా నది ఒడ్డున ముసలి సంచారం **
° అల్మాయిపేట గ్రామ శివారులో కలకలం
( డిసెంబర్17) అందోల్
నవభారత ప్రతినిధి రవి.
.సంగారెడ్డి జిల్లా: ఆందోల్ మండలం అల్మాయపేట గ్రామ శివారులో ప్రవహిస్తున్న మాంజీర నది ఒడ్డున మొసలి సంచరిస్తున్నట్టు గతంలో సంబంధిత అధికారులకు తెలియజేసిన వారు మొసలి గురించి పట్టించుకోక నిర్లక్ష్యం చేశారని. గ్రామస్తులు తెలియజేస్తూ మేము పశువులు మేపుకొని నీరు త్రాగించడానికి నది తీరం వైపు వెళ్లాలంటే చాలా భయభ్రాంతులకు గురయ్యామని పశువుల కాపరులు.తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పుడు ఏకంగా మంజీరా నది ఒడ్డున .నిద్రిస్తున్నటువంటి.మొసలిని. నదిలో చేపలుపడుతున్న. మత్స్యకారులు గుర్తించి. సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని మా పశువులను మమ్మల్ని కాపాడాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు..