*త్వరలో మీ లెక్కలెంటో జనాలు తేలుస్తారు*

NavaBharath News Kandukur
0


 నవభారత్ న్యూస్ 


*త్వరలో మీ లెక్కలెంటో జనాలు తేలుస్తారు*


*- మాజీ జెడ్పిటిసి వ్యాఖ్యలపై మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి ఫైర్*


*- బీఆర్ఎస్ నాయకుల చేసిన వ్యాఖ్యలు ఖండన*


*- మిషన్ భగీరథ పనులపై చర్చకు రాలేరని ఎద్దేవా* 


*- అభివృద్ధిపై చర్చకు మేము ఎక్కడికైనా సిద్ధం*


*- బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్*


                                  ప్రజా సమస్యలు పట్టించుకోకుండా శిలాఫలకాల ఏర్పాటుపై బొల్లారం మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఇటీవల కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిపై కాకుండా మిషన్ భగీరథ పైప్లైన్ పనులపై మున్సిపల్ ప్రజల ఒత్తిడి మేరకే ప్రెస్ మీట్ లో ప్రశ్నించడం జరిగిందని దీనిపై ఓపెన్ సవాల్ విసిరినట్లు చెప్పారు. ప్రజా క్షేత్రంలో తాము చేసిన సవాల్'ను స్థానిక బీఆర్ఎస్ నాయకులు స్వీకరించకుండా ముఖం చాటేసారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మిషన్ భగీరథ నీటిని విడుదల చేసిన మాట వాస్తవమేనని కానీ అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ పనులను పెట్టుకొని శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని చెప్పలేదని విషయాన్ని సూటిగా ప్రశ్నించారు. మున్సిపాలిటీలో బాగున్న రోడ్లను ధ్వంసం చేయడం ఎందుకని, ఎక్కడైతే పైప్లైన్ కోసం తవ్వడం జరిగిందో అక్కడ మరమ్మతులు చేసుకుంటే కొన్నేళ్లపాటు సమస్యలు రావంటూ అడగడం జరుగుతుందన్నారు. మిగతా వార్డులలో చాలా చోట్ల డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యల ప్రస్తావిస్తే తప్పుపడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించడం ఎంతవరకు సబాబు అని ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎక్కడ అడ్డుపడింది కౌన్సిల్ సమావేశాల్లో ఇష్టారాజ్యంగా తీర్మానాలు చేసుకుంటూ పక్షపాతంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. సమావేశాల్లో పాలకవర్గ కౌన్సిలర్లు సమస్యలపై మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. వీళ్లకు ప్రజా సమస్యలు పట్టవన్నారు. ఒకవేళ సమస్యలపై గొంతు ఎత్తి మాట్లాడితే, సభను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలు మాట్లాడితే అవగాహన లేనట్టా, ఉన్నట్టా మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. చౌకబారు రాజకీయాలు చేయడం తప్ప సమస్యల పరిష్కారానికి చేసింది ఏమీ లేదన్నారు. మాకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంటే మీకు కేవలం దోచుకునే అవగాహన మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. మరి ఈ వ్యవహారంపై జనాలు ఎవరు కావాలో త్వరలో తేల్చుకుంటారన్నారు. పేద ప్రజల రక్తపు బొట్టు తాగడమే మీకాలంటూన్నారు. మున్సిపాలిటీలో దాదాపు 1,500 ఫ్లాట్ల వరకు సొంత ప్రయోజనాల కోసం, అటు గండిగుడం వరకు, ఇటు సర్వీసు రోడ్డు వరకు కతం చేసిన ఘనత మీకే దక్కుతుందన్నారు. సామాన్య ప్రజల సమస్యలు విస్మరించి అధికార ధన దాహంతోనే రాజకీయాలు చేయాలనుకోవడమే మీకు తెలుసని అవహేళన చేశారు. సమస్యలు లేవని చెప్పడం వారి అవివేకానికి పరాకాష్టన్నారు. సవాల్ విసిరిన, రాకుండా ప్రగల్బాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. నేను సర్పంచ్'గా బస్టాండ్ ఏర్పాటు చేస్తే, అది కూడా ఉండొద్దన్న ఉద్దేశంతో గాంధీనగర్లో సంపు కట్టినా, బస్టాండ్'లో సంపు కట్టినా, వచ్చే వాటర్ అవేకదా అని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేతో మాట్లాడి ఆరు నెలలు నిర్మాణం కాకుండా అడ్డుకున్నామన్నారు. బస్టాండ్ లేకపోతే సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని ముందే గ్రహించినా, వాళ్ల పంతం నెగ్గించుకునేలా ముందుకు వెళ్లారు. ఇదే బస్టాండ్ వద్ద మీటింగ్ల సమయం అనేది కాకుండా, రవాణా సౌకర్యం మరియు అన్ని విధాలుగా జనాలకు అనుకూలంగా ఉంటుందని భావిస్తే అలాకాకుండా వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వారి తీరు ఏంటో అర్థం కావడం లేదన్నారు. స్కూల్ గ్రౌండ్ కోసం ఆరెకరాలు నాడు కేటాయించాం. హరితహారం కోసం పెద్ద ఎత్తున 30నుంచి 40 లక్షలు కేటాయించారు. మరి చెట్లు ఎక్కడ నాటారో చూపాలన్నారు. నాడు పంచాయతీ బడ్జెట్ రెండు కోట్ల లోపు ఉంటే, నేడు మున్సిపాలిటీలో 24 కోట్ల బడ్జెట్ను ఏమి చేశారు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ప్రజాధనం స్వాప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. మున్సిపాలిటీలో సమస్యలు ఉన్నాయనే విషయాన్ని వాస్తవంగా ఒప్పుకోవాలని హితవు పలికారు. ప్రజాధనాన్ని దోచుకొని తిన్న మీరు నన్ను ప్రశ్నిస్తారా? జనాలు మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు నీ వెనకున్నోళ్లు చప్పట్లు కొట్టుకుంటూనే ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే బొల్లారాన్ని అన్ని విధాల స్వాహా చేశారని, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన డబ్బులను సైతం దిగమింగి కాంగ్రెస్'ను గెలిపించిన విషయం గుర్తుంచుకోవాలని సూటిగా ప్రశ్నించారు. ఇక మీ రాజకీయ భవిష్యత్తుకు సమయం దగ్గర పడిందన్నారు. ఇలాంటి దుర్మార్గులకు సరైన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. అసలు మూడో వార్డులో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపాలన్నారు. రోడ్లు తవ్వి అస్తవ్యస్తంగా తయారు చేయడమే కాకుండా పైప్ లైన్'ల పేరిట రోడ్డుపై చేరుతున్న నీటితో నిత్యం జనాలు ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకుడా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. మీరిచ్చిన సవాల్ను స్వీకరించి గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చాం. మరి నువ్వెక్కడున్నావ్? డప్పు కొట్టుకునే మాటలు చెల్లెవు. అభివృద్ధి మీద పోరాటం ఎక్కడినుంచైనా మేము సిద్ధం. సమస్యలపై బీసీ కాలనీ నుంచి ఐడిఏ కాలనీ వరకు ఎక్కడికి రమ్మన్నా వస్తాం చర్చిద్దాం. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి సంవత్సరం గడుస్తోంది. నిధులు వస్తున్నవి కాంగ్రెస్ ప్రభుత్వానివి. ఈరోజు రోడ్లేస్తున్నవి కాంగ్రెస్ తరపున, రేపు ఇండ్లు కూడా కాంగ్రెస్ తరపున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక నువ్వు నీ తమ్ముడు పోయిన విధంగానే ముల్లె మూట సద్దుకొని పోవాల్సిన టైం దగ్గర పడిందని హెచ్చరించారు. నీకున్న సమయం ఒక్క నెల రోజులు మాత్రమే, ఈలోగా ఏం చేసుకుంటావో చేసుకో... మేమేంటో చూపిస్తాం అని బీఆర్ఎస్ నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వార్డులలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు అండగా ఉండి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాలమ్మ, చంద్రయ్య, కార్మిక నాయకులు లక్ష్మారెడ్డి, స్థానిక నాయకులు శ్రీధర్ రెడ్డి, రమణయ్య, మాజీ ఎంపీటీసీ రాజు, రాజ్ గోపాల్, చంద్రారెడ్డి, చక్రపాణి, రవీందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ భాస్కర్, దిననాధ్, రాజారామ్, శ్రీమన్నారాయణ, నరేందర్, రాజు, శేఖర్, లక్కన్, రవితేజ, దిగంబర్, శ్రీను, యువజన కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ బషీర్, ఇమ్రాన్, ప్రవీణ్, నవీన్, ఆటో యూనియన్ నాయకులు, పరిశ్రమ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top