రోడ్డు ప్రమాదంలో బొడగట్టు కు
చెందిన రాజేష్ గౌడ్ మృతి!
*****
( నవభారత ప్రతినిధి రవి.)
*రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి చెందిన ఘటన మాచవరం
- పేరూరు మధ్యలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందిచారు. టేక్మాల్ మండల పరిధిలోని బోడగట్టు గ్రామానికి చెందిన రాజేష్ గౌడ్ (36)గా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అన్నారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజేష్ గౌడ్ మృతి పట్ల బొడగట్టు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రాజేష్ గౌడ్ వృత్తిపట్ల గ్రామ మాజీ సర్పంచ్ పట్లోళ్ల బుమిరెడ్డి, మాజీ సర్పంచ్ రాంచందర్, మైల్లారం పోచయ్య, టేక్మాన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ ,జిల్లా మైనార్టీ కమిటీ చైర్మన్ షేక్ మజ్జార్, జోగిపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేష్ గౌడ్ సంతాపం తెలిపారు.ఆయన వృత్తి పట్ల ఒక్క మంచి కార్యకర్తలు కోల్పోయామని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.*