నవభారత్ న్యూస్....
అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు పేల్చారు.
హైదరాబాద్. నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.
అసెంబ్లీ ప్రారంభం కాగానే… కాంగ్రెస్ సభ్యులపై హరీష్ రావు రెచ్చిపోయారు. బయటనే కాదు… సభలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలి అని… మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సభలో కొంతమంది సభ్యులు పొద్దున్నే తాగి సభకు వస్తున్నారు అని హరీష్ రావు సెటైర్లు పేల్చారు.
ఇక అటు హరీష్ రావు వ్యాఖ్యలపై భగ్గుమన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ గా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. హరీష్ రావు గారు ప్రతిపక్ష నాయకుణ్ణి ఉద్దేశించి మాట్లాడారని కేసీఆర్ పేరు ఎత్తారు. ఆయన తాగి సభకు రాకుండా ఫాం హౌస్ లో పడుకున్నాడు…బాత్ రూమ్ లో కూడా అలానే పడ్డాడేమో అంటూ చురకలు అంటించారు.
మద్యం సేవించి అసెంబ్లీకి వస్తున్నరు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ గేట్ దగ్గర డ్రాంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన అవసరం ఉంది అని,హరీష్ రావు సంచలన వాక్యాలు చేశారు.