*ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య!*

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్....

*ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య!*


 పాపన్నపేట మండలం ఏడుపాయల ఆలయ సమీపంలో


 (*నవభారత ప్రతినిధి రవి *)



              మతిస్థిమితం సరిగా లేక చెట్టుకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాపన్నపేట మండలం ఏడుపాయల ఆలయ సమీపంలోని మంజీరా నది ఒడ్డున బుధవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా బిలాల్ పూర్ గ్రామానికి చెందిన బలుపాటి ఆనంద్(33) కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.గత కొన్నిరోజులుగా మతిస్థిమితం కోల్పోయాడు.ఈనెల15న ఇంట్లో నుండి బయటకు వెళ్లాడు.రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు.బుధవారం ఏడుపాయల ఆలయ సమీపంలోని మంజీరా నది ఒడ్డునా చెట్టుకు ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఉండటాన్ని అటుగా వెళ్లిన స్థానికులు గమనించారు.పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఆనవాళ్లను మృతి చెందింది ఆనంద్ గా గుర్తించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులున్నారు.మృతుడి అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top