చెమిదిదపాడు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి

NavaBharath News Kandukur
0

 చెమిదిదపాడు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి నాగినేని కోటేశ్వరరావు 27 వేల రూపాయలు విరాళం

గుడ్లూరు డిశంబర్ -16(నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్. ఆంజనేయులు )నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చెమిడిదపాడు బస్టాండు వద్ద నిర్మాణం లో ఉన్న శ్రీ రామ భక్త భవిష్యత్ బ్రహ్మ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం నిర్మాణం కోసం కందుకూరు కు చెందిన నాగినేని కోటేశ్వరరావు, రేవతి దంపతులు శనివారం 27 వేల రూపాయల విరాళం అందించారు. ఆ మొత్తం చెక్కు ను హనుమత్ ప్రసాద్ గురుస్వామి కి,హనుమాన్ దీక్షా పరుల సమక్షంలో ఏకా దశ హనుమాన్ చాలీసా పారాయణము కార్యక్రమంలో కోటేశ్వరరావు గురుస్వామి అందజేశారు. ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న దాతలు అందరికీ ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు ఆలూరి వెంకట హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. వారికీ ఆ సీతా రామ లక్ష్మణ భరత శతృఘ్న సహిత శ్రీ సువర్చలా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటూ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలిపారు


.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top