నవభారత్ న్యూస్....
*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*
*అంబేడ్కర్ ను అవమానించిన అమిత్ షా మనువాద వ్యాఖ్యలను ఖండించండి*
*అమిత్ షా దేశప్రజలకు క్షమాపణ చెప్పాలి*
*కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్*
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అవమానించారని, ఎగతాళి చేసి అహంకారంగా మాట్లాడటాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాధులు ఖండించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షులు అతిమేల మానిక్ పేర్కొన్నారు..
ఈ మేరకు కేవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అతిమేల మానిక్ కార్యదర్శి అశోక్ లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. .వారు మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ పట్ల ఆర్ ఎస్ ఎస్ బీజేపీ కి ఉన్న అవగాహణనను వ్యక్తం చేశారని అట్టడుగు వర్గాల పట్ల వారి వైఖరిని చెప్పారని అన్నారు దుర్మార్గమైన దారుణమైన అహంకార చర్యను అందరూ ఖండించాలన్నారు .
ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన తెలపడం హర్షణీయమన్నారు.
ఈ మతోన్మాద చర్యను కెవిపియస్ ఖండిస్తుందన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలన్నారు.
ఎన్నిసార్లు అంబేద్కర్ అని పదే పదే అతడిని స్మరించుకుంటారు దానికి బదులుగా ఏదో ఒక హిందూ దేవుడిని స్మరించుకుంటే మీకు 7 జన్మలకు స్వర్గం దక్కుతుందనడం సిగ్గు చేటన్నారు. అలా అనటమే కాకుండా మాటి మాటికీ అంబేద్కర్ పేరు ఎత్తడం వీళ్లకు పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని ఏగతాళిగా మాట్లాడటం తగదన్నారు.
ఎన్పికల ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారం లోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పటం సిగ్గు చేటన్నారు . నేటి మనువాద మతోన్మాద ప్రభుత్వంలో రాజ్యాంగం పై, ప్రభుత్వరంగ సంస్ధలపై దాడి జరుగుతుందన్నారు
. ఈ దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవలిసిన అవసరం ఉందన్నారు...