నవభారత్ న్యూస్
పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనకు గర్వకారణం కెటిఆర్
హైదరాబాద్. నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.
తెలంగాణ ఏర్పాటు తర్వాత పీవీ నరసింహారావును BRS ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని కేటీఆర్ అన్నారు. 'గడ్డు కాలంలో ప్రధానిగా సేవలందించి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారు. ఆయన తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణం. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాం. భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి తీర్మానం పంపాం. ఆయన కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం' అని పీవీ వర్ధంతి సందర్భంగా ట్వీట్ చేశారు.