వరి సాగుకు వెనుకడుగు వేసిన రైతన్నలు." ---నీటి ఏద్దడి తప్పదనుకున్నారో ఏమో.... ప్రత్తి

NavaBharath News Kandukur
0

 " వరి సాగుకు వెనుకడుగు వేసిన రైతన్నలు."

---నీటి ఏద్దడి తప్పదనుకున్నారో ఏమో.... ప్రత్తి సాగుకే మొగ్గు చూపుతున్న రైతన్నలు.

---అన్నదాతల్లో మార్పు తీసుకురాలేని పొలం పిలుస్తోంది, పొలం బడి కార్యక్రమాలు.

గుడ్లూరు డిశంబర్ -19 (నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్. ఆంజనేయులు ) గుడ్లూరు మండల పరిధిలో రాళ్లపాడు జలాశయం కింద కుడి కాలువ పరివాహంలో అన్నేబోయినపల్లి, సీతారామపురం, దారకానిపాడు, రాళ్లపాడు, గుల్లపాలెం, గుడ్లూరు గ్రామాల్లోని వ్యవసాయ సాగు భూముల్లో ఈ సంవత్సరం కూడా రైతన్నలు వరి పంటను సాగు చేయుటకు వెనుకడుగు వేశారు. రాళ్లపాడు రిజర్వాయర్ కుడి కాలువ పరివాహకంలో వరిని సాగు చేసే మాగాణి భూములు ఎక్కువ భాగం ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.ప్రత్తిపంటను సాగు చేయుటకు రైతులు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అందరికి అన్నం పెట్టె రైతన్నలు వరి సాగుకు వెనుకడుగు వేయుటకు కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా నీటి ఎద్దడి, పెట్టుబడులు అధికం, ఫలితంగా దిగుబడి తక్కువ, వడ్లకు గిట్టుబాటు ధరలు లేకపోవటం వంటి అనేక కారణాలు రైతన్నలను వరి సాగుకు వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి. వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది, పొలం బడి వంటి కార్యక్రమాల ద్వారా అనేక రకాలైన లాభసాటి వ్యవసాయం గురించి అవగాహన కల్పించినప్పటికి రైతుల్లో మార్పు తీసుకు రాలేకపోయింది. ఇప్పటికే కొందరు రైతులు పూర్తిగా వ్యవసాయం సాగుకు స్వస్తి పలికి తమ మాగాణి భూముల్లో సైతం సవకలు, జామాలిని మొక్కలు పెంచుతున్నారు.కాబట్టి ప్రస్తుతం రైతన్నలు ఎక్కువ భూములను ప్రత్తి పంట సాగుకు కేటాయించి అధను కోసం ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం కొన్ని చోట్ల కొంతమంది రైతులు మాత్రమే వరి నాట్లు వేసి రాళ్లపాడు సాగునీటికోసం ఎదురు చూస్తున్నారు. కుడి కాలువ గేటు మరమ్మతులకు గురై, సమస్య పరిస్కారం కాక ప్రాజెక్టు అధికారులు, రాజకీయ నాయకులు, రైతులు తీవ్ర ముగా కృషి చేస్తున్నట్టు సమాచారం. సమస్య పరిష్కారం కాగానే కుడి కాలువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నట్లు రైతులు కొందరు తెలిపారు.ప్రస్తుతం నీరు లేక వెలవేళబోతుంది కుడి కాలువ



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top