*ఢిల్లీలో సేవరత్న జాతీయ అవార్డు పురస్కారాన్ని అందుకున్న*
*ప్రముఖ సంఘ సేవకులు కేజేఆర్ ఫౌండేషన్ అధినేత కొత్వాల్ ఆనంద్ కృష్ణారెడ్డి*
*నవభారత ప్రతినిధి రవి*
*నా సేవలను గుర్తించి అంతర్జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో*
*జాతీయ సేవా రత్న అవార్డు పురస్కారాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది అన్న*
భారతీయ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సేవ రత్న జాతీయ అవార్డు పురస్కారాన్ని నేను తలపెట్టిన సామాజిక కార్యక్రమాలు ప్రజా ఉద్యమాలు నిరుపేద పేద ప్రజలకు అందించిన ఆర్థిక సహాయాన్ని ప్రజా చైతన్య కార్యక్రమాలను తలపెట్టి సమాజ శ్రేయస్సు కోసం నిరంతరంతా ప్రతితపిస్తున్న సామాజిక ఉద్యమ సారధి కె.జె.ఆర్ ఫౌండేషన్ అధినేత కొత్వాల్ ఆనంద్ కృష్ణారెడ్డి కి వివిధ రంగాలలో అనేక ప్రముఖ సేవను అందిస్తున్నందున సేవలను గుర్తించి అంతర్జాతీయ బహుజన సాహిత్య అకాడమీ ప్రతిష్టాత్మకంగా అవార్డును ప్రధానోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ ప్రాంతానికి చెందిన కేజేఆర్ ఫౌండేషన్ అధినేత ప్రముఖ సంఘ సేవకులు ఆనంద్ కృష్ణారెడ్డి నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సేవలో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ పేదల సంక్షేమం అభివృద్ధి తన ఎజెండాగా ప్రజల శ్రేయస్సు తన కర్తవ్యం గా ప్రజల కొరకు అభాగ్యులకు ఆపన్న ఆస్తంగా అన్నా ఆపద అంటే నేనున్నాను మీకు అండగా అంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కొత్వాల్ ఆనంద్ కృష్ణారెడ్డి కి అంతర్జాతీయ బహుజన సాహిత్య అకాడమీసంస్థ ఆనంద్ కృష్ణారెడ్డికి భారతదేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ బహుజన సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా ఘనంగా సన్మానించి అవార్డు పురస్కారాన్ని ప్రధానోత్సవం చేయడం జరిగింది.
ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా జాతీయ సేవా రత్న అవార్డు పురస్కారాన్ని నేను అందుకున్నందుకు గర్వపడుతున్నాను అన్నాడు, ఈ సంతోషంతో పాటు నాలో ఇంకా ప్రజలకు మరింత సేవ చేయాలి అనేటువంటి సంకల్పం పెరిగిందని వారు తెలిపారు. నా వెన్న అంటూ ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తలపెడుతున్న సామాజిక కార్యక్రమాలు నిరుపేద పేద ప్రజల కు ఆర్థిక సహాయాన్ని అందిస్తు ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా ముందుకు వెళుతున్న నాకు నా సతీమణి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నేను సాధించిన విజయాలకు పూర్తి సంపూర్ణ సహకారాన్ని అందించిన నా సతీమణికి కొత్వాల్ లక్ష్మి ఆనంద్ కృష్ణారెడ్డి నా కుటుంబ సభ్యులకు సేవారత్న జాతీయ అవార్డును అంకితం చేస్తున్న అన్నారు,
నేను తలపెట్టిన సామాజిక కార్యక్రమాలు ప్రజా ఉద్యమాలు నిరుపేద పేద ప్రజలకు అందించిన ఆర్థిక సహాయాన్ని సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి అంతర్జాతీయ బహుజన సాహిత్య అకాడమీ భారత దేశ రాజధాని ఢిల్లీలో నాకు జాతీయ సేవా రత్న అవార్డు బహుజన సాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ సంస్థ ప్రతినిధులు డా.ఏర్పుల శ్రీనివాస్, సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అదేవిధంగా నేను తడి పెడుతున్న సామాజిక ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలను పత్రికలలో టీవీ ఛానల్ లో యూట్యూబ్ ఛానల్ లలో ప్రచురణ చేసి నా సేవలను సమాజానికి ప్రచారం చేస్తున్న నా విజయానికి సంపూర్ణ సహకారం అందించిన పాత్రికేయులకు వివిధ ఛానల్ లో ప్రజలకు పేరుపేరునా అభివందనం తెలియజేస్తున్నాను అన్నారు,