కాక అడుగుజాడలోనే నడుస్తా ఎంపీ వంశీకృష్ణ

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 

కాక అడుగుజాడలోనే నడుస్తా ఎంపీ వంశీకృష్ణ

హైదరాబాద్ నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.

     మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట్ స్వామి తెలంగాణ ప్రజలకు ఎనలేని సేవలు చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ కొనియాడారు. కాకా పదవ వర్ధంతి (డిసెంబర్ 22) సందర్భంగా ఆదివారం ట్యాంక్ బండ్ దగ్గర కాకా విగ్రహానికి ఎంపీ వంశీ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ స్కీమ్స్ తీసుకొచ్చి కాకా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.

బడుగు బలహీనర్గాలకు ఆయన అండగా ఉన్నారని గుర్తు చేశారు. నిరంతరం పేదల కోసం పరితపించే కాకా అడుగుజాడలలో నడుస్తానని అన్నారు వంశీ. కాకా ఇప్పుడు జీవించి ఉంటే.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‎పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేసే వారని పార్లమెంట్‎లో తనతో చాలా మంది అన్నారని చెప్పారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top