నవభారత్ న్యూస్......
వృద్ధుల కొరకు బ్యాటరీ వాహనం అందజేసిన సిటీ యూనియన్ బ్యాంక్ వారు :
17 -12-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దర్శనార్థం విచ్చేయు వృద్ధ మరియు దివ్యాంగ భక్తుల కొరకు ఈరోజు అనగా తేదీ.17-12-2024 న సిటీ యూనియన్ బ్యాంక్ వారు 6.88 లక్షల విలువ జేయు 6 సీటింగ్ సామర్థ్యం కలిగిన 150 AH సామర్థ్యం(6 బ్యాటరీలు) 4 చక్రాల ఎలక్ట్రికల్ వాహనం(maini buggy) ను ఆలయ ఈవో కె ఎస్ రామరావు గారిని కలిసి అందజేసినారు.
ఈ సందర్బంగా ఆలయ వైదిక సిబ్బంది ఈ వాహనమునకు పూజలు నిర్వహించగా, ఈవో గారు బ్యాంక్ సిబ్బంది, ఆలయ ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో కలిసి వాహనము టెస్ట్ డ్రైవ్ లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆలయ ఈవో గారు మాట్లాడుతూ సిటీ యూనియన్ బ్యాంక్, భవానీపురం బ్రాంచ్ వారు అమ్మవారి, స్వామి వారి భక్తుల సహాయార్థం ఎలక్ట్రికల్ వాహనమును అందజేయడం చాలా శుభ పరిణామం అని, కొండపైన పెద్ద వాహనాములైతే వెనక్కి త్రిప్పుకొనుటకు ఇబ్బందిగా ఉన్నందున గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యుల వారి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సూచనల మేరకు ఇటువంటి చిన్న వాహనములు చాలా ఉపయోగ పడుతాయని, ఈ వాహనమును ప్రతి రోజు వృద్దులు మరియు దివ్యాంగులు మరియు నడవలేని వారి సేవలో ఉంచనున్నట్లు తెలిపి, సిటీ యూనియన్ బ్యాంక్ వారిని ప్రశంసించి, బ్యాంక్ ఎం.డి & సీఈఓ ఎన్. కామకోడి గారికి ధన్యవాదములు తెలిపి, అమ్మవారి స్వామి వారి ఆశీస్సులు వీరికి ఎల్లపుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా ఆలయ ఈవో గారు సిటీ యూనియన్ బ్యాంక్ వారికి అమ్మవారి దర్శనం కల్పించి, ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిటీ యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ వేమూరి రమేష్ కుమార్, బ్యాంక్ మేనేజర్ హరిహరన్ మరియు బ్యాంక్ సిబ్బంది, ఆలయ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.