నవభారత్ న్యూస్
22-12-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
ఈరోజు అమ్మవారి ఆలయమునకు విచ్చేసిన గౌరవనీయులైన రాష్ట్ర హోమ్ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ..
వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు గారు ..
అనంతరం వీరికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో గారు శ్రీ అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.
హోమ్ మంత్రివర్యులు వారితో పాటుగా పోలీస్ కమీషనర్ SV రాజశేఖర్ బాబు కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా భవాణీ దీక్షల సందర్బంగా భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లను గురించి మంత్రివర్యుల వారికి పోలీస్ కమీషనర్ గారు, ఆలయ ఈవో గారు వివరించారు.
అనంతరం మంత్రివర్యులు అమ్మవారి దర్శనం నకు విచ్చేసిన పలువురు భవాణీ భక్త బృందములతో మాట్లాడి ఏర్పాట్లు పై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోగా భక్తులు ఏర్పాట్లు పై సంతృప్తి ని వ్యక్తపరిచారు.