నవభారత్ న్యూస్....
*శ్రీ భ్రమరాంబ సమేత కేతమ్మ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం*
నవభారత ప్రతినిధి రవి.
వట్పల్లి మండల్ మారవెల్లి గ్రామం లో శ్రీ భ్రమరాంబ సమేత కేతమ్మ మల్లికార్జున స్వామి ప్రథమ వార్షికోత్సవంలో ఈరోజు ఉత్తర నక్షత్ర యుక్త మకర లగ్న పుష్కరంశమున ఆలయ కమిటీ సభ్యులు ఒగ్గు రమేష్, ఒగ్గు శ్రీశైలం వారి ఆధ్వర్యంలో శ్రీ భ్రమరంభం సమేత కేతమ్మ మల్లికార్జున స్వామి వారి ఒగ్గు కళ్యాణ మహోత్సవం జరిగింది తదనంతరం అగ్నిగుండ ప్రవేశం ఒగ్గు బృందం వారిచే ఒగ్గు కథలు చెప్పడం జరిగింది మరియు ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం భగవంతుని అనుగ్రహంతో గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించబదినవి ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాన్ని పొంది పునీతులు కాగలరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు గొల్ల బిర్లా కలబృందానికి,గ్రామ పెద్దలకు గ్రామ యువకులకు గ్రామ ప్రజలకు తదితరులకు భ్రమరాంబ సమేత కేతమ్మ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు అందరూ ధన్యవాదములు తెలియజేశారు.