చాగంటి కోటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక బాధ్యత.. కేబినెట్‌లో నిర్ణయం

NavaBharath News Kandukur
0


 

 నవభారత్ న్యూస్....

చాగంటి కోటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక బాధ్యత.. కేబినెట్‌లో నిర్ణయం

నవభారత్ న్యూస్ ప్రతినిధి రామకృష్ణ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావును ఇఫ్పటికే కేబినెట్‌ హోదాలో సలహాదారు పదవిలో నియమించగా.. తాజాా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలను రూపొందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. చాగంటితో ప్రత్యేక పుస్తకాలను రూపొందించి విద్యార్థులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్‌‌‌లో తీర్మానం కూడా చేశారు.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు- నైతికత- విలువల సలహాదారు పదవిలో కేబినెట్‌ హోదాతో నియమించిన సంగతి తెలిసందే.ఈ మేరకు ఆయన ఆ పదవిని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే చాగంటి కోటేశ్వరరావు పూర్తిస్థాయిలో బాధ్యతల్ని స్వీకరించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు కీలకమైన బాధ్యతలు అప్పగించింది. రెండు రోజుల క్రితం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.


ఏపీ నైతికత విలువల ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలను చాగంటితో పుస్తకాలను రూపొందించి పంపిణీ చేయనున్నారు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేట్‌ చేస్తూనే.. విద్యార్థులకు విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక రూపొందించాలనే మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందజేయాలని నిర్ణయించారు. రూ.32.45 కోట్ల వ్యయంతో అందించే కిట్లలో టెక్స్ట్ బుక్స్, పోటీ పరీక్షల మెటీరియల్, రికార్డ్‌ బుక్స్, రాతపుస్తకాలు ఉంటాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ విద్యార్థులకు జనవరి నుంచి మధ్యాహ్న భోజన పథకం పునరుద్ధరణ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజీల్లో విద్యార్థులకు జేఈఈ, నీట్, ఈఏపీసెట్‌లపై శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్‌ ఇవ్వడంతో పాటుగా.. వీటిని బోధించేందుకు ప్రత్యేక సమయం కేటాయించనుంది ప్రభుత్వం.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top