నవభారత్ న్యూస్.
● హరూన్ రషీద్ మెమోరియల్ సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన మాదిరి ప్రిథ్వీరాజ్.
● పటాన్‌చెరు పట్టణంలోని మైత్రీ మైదానంలో హరూన్ రషీద్ మెమోరియల్ సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్‌లో నిరంజన్ ఎలెవెన్స్ విజేతలుగా, స్పార్టన్స్ (ఇస్నాపూర్) రన్నరప్‌గా నిలిచారు. విజేతలకు బహుమతులను బీఆర్ఎస్ యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ గారు అందజేశారు.హరూన్ రషీద్ కబడ్డీ, క్రికెట్, మరియు ఇతర క్రీడలలో ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారుడిగా పేరు పొందారు. అయితే, నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆయన దురదృష్టవశాత్తు మరణించారు. ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆయన మిత్రబృందం, మాదిరి ప్రిథ్వీరాజ్ గారి ఆర్థిక సహకారంతో ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది టోర్నమెంట్ నాలుగో సీజన్‌ను విజయవంతంగా నిర్వహించారు.కార్యక్రమంలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో సంతోషకరమని మాదిరి ప్రిథ్వీరాజ్ గారు అన్నారు.