ఈ రోజు నుంచి ట్రాఫిక్ విధుల్లో 39 మంది ట్రాన్సజేండర్లు

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్ 


ఈ రోజు నుంచి ట్రాఫిక్ విధుల్లో 39 మంది ట్రాన్సజేండర్లు 


హైదరాబాద్. నావభారత్ న్యూస్ స్టేట్ ప్రతినిధి బేతయ్య.


     హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకున్న 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ విధులు నిర్వహణకు సంబంధించిన ట్రాఫిక్ గుర్తులతోపాటు డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు. కుటుంబం, సమాజంలో ట్రాన్స్ జెండర్స్ ఎంతో వివక్షకు గురువుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని..వారిని సమాజంలో అనుసంధానం చేయాలన్న ఉద్దేశ్యంతోనే మొదటిసారిగా వారికి తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ విభాగంలో హోంగార్డు క్యాడర్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

 ఈ ప్రయోగం విజయవంతం అవుతే దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగా అవకాశలు వస్తుంది అన్ని తెలిపారు. ట్రాన్స్ జెండర్లు పెళ్లిళ్లలో, దుకాణాల వద్ద డబ్బులు డిమాండ్ చేయడం, వ్యభిచారం చేయడం గమనించామని, వారికి సరైన అవకాశాలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్నారు. గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే వారు మారుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చారన్నారు. ముందుగా ట్రాఫిక్ విభాగంలో హోంగార్డు స్థాయిలో వీరి సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్లు సోమవారం నుంచి వీధులకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ అధికారులను సీపీ ఆనంద్ అభినందించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top