నెల్లూరులో జరుగు సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.
గుడ్లూరు. డిసెంబర్ 23 (నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి. హెచ్. ఆంజనేయులు )
ఫిబ్రవరి 1, 2,3, తేదీలలో నెల్లూరులో జరుగు సిపిఎం 27వ మహాసభలను జయప్రదం చేయాలని, గుడ్లూరు, లింగసముద్రం మండలంల ఏరియా కమిటీ కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నాడు గుడ్లూరు ఏరియా కమిటీ మరియు ముఖ్యుల సమావేశం మద్దిశెట్టి జాలయ్య అధ్యక్షతన గుడ్లూరులోని రామాల శివరామరెడ్డి ఆవరణలో జరిగింది. నెల్లూరు జిల్లా అంటే పోరాటాల పురిటి గడ్డ. భరతమాత ముద్దుబిడ్డ కామ్రేడ్ సుందరయ్య, పేదల పెన్నిధి కామ్రేడ్ జక్కా వెంకయ్య, పేదలకు అతి తక్కువగా వైద్యం అందించే డాక్టర్ రామచంద్ర రెడ్డి హాస్పిటల్ అది నేతలు రామచంద్రారెడ్డి డాక్టర్ జెట్టి శేషారెడ్డి యోధాని యోధులు పుట్టిన గడ్డ నెల్లూరు. అని గుడ్లూరు ఏరియా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు అన్నారు. 40 సంవత్సరాల క్రితం రాష్ట్ర మహాసభలకు ఆతిధ్యం ఇచ్చి జయప్రదంగా మహాసభలను జరిపిన చరిత్ర నెల్లూరుకు ఉంది. మరల 27వ మహాసభలకు ఆతిథ్యం ఇస్తుంది. ఈ మహాసభలు ముగింపుగా ఫిబ్రవరి మూడవ తేదీన వేలాది మందితో ఎర్రదండు కవాతు చేస్తుంది. బహిరంగ సభలో సిపిఎం పోలేట్ బ్యూరో సభ్యులు ఎం.ఏ బేబి, బివి రాఘవులు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మీ శ్రీనివాసరావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమేష్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మహాసభల జయప్రదం కోసం, గుడ్లూరు, లింగసముద్రం, ప్రజలు మేధావులు అభ్యుదయవాదులు కార్మిక కర్షకులు కృషి చేయాలని, ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని సిపిఎం ఏరియా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు కోరుతున్నారు. ఈ సమావేశంలో గుడ్లూరు సిపిఎం కార్యదర్శి గుత్తి మల్లికార్జున, నాయకులు దామా కృష్ణయ్య, కొమరగిరి అంజయ్య, పాలకుర్తి నాగేశ్వరరావు, పాలకీర్తి సైదులు, డి.బాలకోటయ్య, చేవూరు సిపిఎం కార్యదర్శి ఇరువురి బ్రహ్మయ్య, డి. పిచ్చయ్య, వర్ధినేని సిద్దయ్య, కొమరగిరి నాగేశ్వరరావు, నేలకూరి తిరుపాల్, తదితరులు పాల్గొన్నారు.