నవభారత్ న్యూస్....
*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య**
"
డిసెంబర్ 21న వికలాంగుల రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు
రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల కళాకారులు హాజరు
ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3ను పురస్కరించుకొని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య తెలిపారు. ఈ రోజు చిక్కడపల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, కోశాధికారి ఆర్ వెంకటేష్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్బంగా గత 10 సంవత్సరాలనుండి నుండి ప్రతి ఏటా వికలాంగులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.వికలాంగులైన కళాకారులను ప్రోత్సాహించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తుంటే, వారిని ప్రోత్సాహించేందుకు వికలాంగులతో ఆట పాట, సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వైకాల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని అనేక మంది వికలాంగులు అయినా కళాకారులూ నిరూపించారాని అన్నారు. అవకాశాలు కల్పిస్తే వికలాంగులు ఏదైనా సాధిస్తారని అన్నారు.సకలాంగులైన కళాకారులకు ఇస్తున్న ప్రాధాన్యత వికలాంగులైన కళాకారులకు ఇవ్వడం లేదన్నారు.కూచిపూడి, భారతనాట్యం, బతుకమ్మ, బోనాలు, మిమిక్రి, డాన్స్, జనపద గేయాలు, వీల్ చైర్ డాన్స్, కోలాటం వంటి కళప్రదర్శనలు వికలాంగులతో ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు.సాంస్కృతిక సారధిలో వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించాలని, కళాకారులూ అయినా వికలాంగులకు సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు, పెన్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక సారథి ఉద్యోగాల్లో వికలాంగులకు 5శాతం ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమలను ప్రచారం చేసి కార్యక్రమలలో వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
అడివయ్య యం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి