నవభారత్ న్యూస్.....
*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*
*
*19న చలో అసెంబ్లీ ముట్టడి*. *జై భీమ్... జై మాలమహానాడు*
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహంతో, మొండి వైఖరితో తీసుకుంటున్న ఎస్సీ వర్గీకరణ చేస్తాననే నిర్ణయాన్నీ వెనక్కి తీసుకోవాలి, అలాగే మన దళితులను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా దూరం పెట్టడానికే ఈ దుశ్చర్య, ఎందుకంటే మన ఐక్యతను దెబ్బతెస్తే ఇక మనం ప్రశ్నించలేం కాబట్టే ఈ వర్గీకరణ అనే అంశాన్ని ముందటేసుకున్నారు, కాబట్టి రేపు అనగా
19-12-2024 రోజున ఉదయం 9:00 గంటలకు
(హైదరాబాద్) అసెంబ్లీని ముట్టడించడానికి, ప్రతీ ఒక్క మాల బిడ్డ సంగారెడ్డి జిల్లా నుండి వేలాదిగా తరలిరావాలని సంగారెడ్డి జిల్లా *మాల మహానాడు అధ్యక్షులు అందోల్ మల్లేశం* గారు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గ అధ్యక్షులు కరుణాకర్ మేతరి, అందోల్ మండల అధ్యక్షులు బహుజన ప్రసాద్
యువజన విభాగం నాయకులు చెట్టయ్యా, జిల్లా నాయకులు దీనభాంధవ్ గారు, తదితర నాయకులు పాల్గొన్నారు.