నవభారత్ న్యూస్
10వ తరగతి విద్యార్థులకు వరల్డ్ విజన్ సంస్థ ద్వారా మోడల్ పేపర్స్ పంపిణీ.
ఈ రోజు కందుకూరు సబ్ కలెక్టర్ గారి ఆఫీసు నందు వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 65 మంది విద్యార్థిని ,విద్యార్థులకు మోడల్ పేపర్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమని శ్రీ పూజ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ , ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మంచి మార్కులు సంపాదించాలని ,అదేవిధంగా జీవితంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని తదనుగుణంగా నడుచుకొని ఉన్నత ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని అప్పుడు మాత్రమే మీరు మీ కుటుంబానికి ,మరియు సమాజానికి ఆదర్శంగా ఉండగలరని తెలియజేశారు.మార్చి లో జరిగే 10 వ తరగతి పరీక్షలకు ఈ మోడెల్ పేపర్స్ బాగా చదినట్లయితే ఎక్కువ మార్కులు సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక విద్యార్థులు ఈ అవకాశాన్ని సవినియోగం చేసుకోవాలని తెలియజేశారు.. విద్యార్థులు అభివృద్ధి అవడానికి మరియు చదువుకోవడాకి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్న వరల్డ్ విజన్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా పాల్గొన్న విద్యార్థుల అందరిని వారి యొక్క లక్ష్యాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది........
ఈ కార్యక్రమానికి అతిథిగా కందుకూరు మండలం ఎం ఇ ఓ సుబ్బారెడ్డి గారు పాల్గొని వరల్డ్ విజన్ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు..పిల్లలుబాగా చదువుకోవాలని మంచి మార్కులు సంపాదించి తల్లిదండ్రుల కోరికలు నెరవేరచాలని , మంచి స్థాయిలోకి రావాలని విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో లో వరల్డ్ విజన్ సంస్థ మేనేజర్ కె యెషయా గారు,మరియు ప్రోగ్రాం కో ఆర్డినేటర్ వై.పుల్లయ్య గారు,వలేంటర్స్ బి శివకృష్ణ,భారతి, శ్రీదేవి,మమత,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.