*నవభారత్ ఆందోల్ నియోజకవర్గం న్యూస్ రిపోర్టర్ మన్నే పోచయ్య*
*పెన్షన్ పెంపు కోసం ఫిబ్రవరి 10న ఛలో ఢిల్లీ*
*జనవరి 1నుండి ఫిబ్రవరి 10వరకు దేశవ్యప్త ప్రచారోద్యమం* *
*NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య*
వికలాంగుల కనీస పెన్షన్ 10,000 ల పెంపు కోసం ఫిబ్రవరి 10న ఛలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య తెలిపారు.*ఈ రోజు కేవల్ కిషన్ భవన్లో NPRD సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షురాలు సి సాయమ్మ అధ్యక్షతన జరిగింది*.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస పెన్షన్ 10,000 లకు పెంచాలని డిమాండ్ చేశారు.
2011నుండి పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 300 రూపాయలు మాత్రమే చేల్లిస్తుంది. నిత్యావసర సరకుల ధరలు 300 రేట్లు పెరిగినవి. కానీ పెన్షన్స్ మాత్రం పెంచకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ధరల పెరుగుదల సూచికి పెన్షన్స్ అనుసంధానం చేయాలి.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పతకాన్ని వికలాంగులందరికి వర్తింపచేయాలి.రాజస్థాన్ రాష్ట్రం మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలి.2015డిసెంబర్ 3న అర్బటంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన సుగమ్య భరత్ అభియాన్ పథకం అమలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధుల కేటాయింపులో కేంద ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఫలితంగా 2024 సంవత్సరo పూర్తివుతున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం.కేంద్ర ప్రభుత్వం అసమర్ధత వలన 2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్,2007 ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం,నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్ వంటి కీలక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.2016RPD చట్టానికి సవరణ చేయడానికి విడుదల చేసిన గెజిట్ను రద్దు చేయాలి.2016 RPD చీఫ్ కమిషనర్,నేషనల్ ట్రస్ట్ కు 10 ఏండ్ల నుండి చైర్మన్స్ నియమించడం లేదు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అందని ద్రాక్షగా మారుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలి.ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటికరణ వలన వికలాంగులు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకాన్ని వికలాంగులందరికి వర్తింప చేయాలి.రాజస్థాన్ రాష్ట్రం మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా చట్టాన్ని చేయాలి. ప్రతి ఏటా 15 శాతం పెన్షన్ పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి.ఉపాధి హామీ పథకంలో వికలాంగులు చేయడానికి అనువుగా ఉన్న పనులను గుర్తించి పని కల్పించాలి. దరఖాస్తూ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలి.
వివాహంతో సంబంధం లేకుండా వికలాంగులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయాలి.అన్ని రకాల రైలులలో వికలాంగుల ప్రయాణ రాయితీ సౌకర్యాన్ని పునరుద్దరించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులు రాయితీలను పొండెందుకు UDID కార్డునే గుర్తింపుగా పరిగణించాలి.బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి 5శాతం నిధులు కేటాయించాలి.వికలాంగుల విద్యా అభివృద్ధి కోసం తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల మాదిరిగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విద్యా పాలసి చేయాలి.సకలాంగుల క్రీడాకారులతో సమానంగా వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సహించాలి.పారా క్రీడాలను అభివృద్ధి చేయాలి.కేంద్ర ప్రభుత్వ శాఖలాన్ని వికలాంగుల సంక్షేమనికి 5శాతం నిధులు కేటాయించి, ఖర్చు చేయాలి.నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 1నుండి ఫిబ్రవరి 10 వరకు దేశవ్యప్త ప్రచార ఉద్యమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి బుక్క ఇస్మాయిల్,
ఉపాధ్యక్షులు మన్నే పోచయ్య, నాగయ్య, సహాయ కార్యదర్శులు నర్సిములు, రాంచంధర్, జిల్లా కమిటీ సభ్యులు కృపవారం,ఖలీల్ మియా , యదులు,లక్ష్మణ్,నరేష్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.
*సాయమ్మ*
జిల్లా ఉపాధ్యక్షురాలు