నవభారత్ న్యూస్......
-చెంచిరెడ్డిపాలెంలో "పంట కాలువలో పూడికతీత పనులు."
---గుడ్లూరు ఎంపిడిఓ. వై.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో....
గుడ్లూరు నవంబర్-22(నవభారత్
న్యూస్ ప్రతినిధి ఆంజనేయులు
గుడ్లూరు మండల పరిధిలోని బసిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చెంచిరెడ్డిపాలెం గ్రామంలో శుక్రవారం గుడ్లూరు ఎంపిడిఓ వై.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల కిందట పూడిక తీసిన పంట కాలువను పూడిక తీయించడం జరిగింది. ఇందులో భాగంగా పంట కాలువకు గృహాల్లో నుండి వస్తున్న, మరుగుదొడ్ల నుండి వస్తున్న మురుగు వ్యర్ధాలను పైపుల ద్వారా పంట కాలువకు వదిలివేసినందున పంట కాలువ పూర్తిగా పూడిపోయి దోమలకు నిలయాలుగా మారి దీర్ఘకాలంగా అదే పద్ధతిలో ఉన్నందున గ్రామస్తులు కొంతమంది ఆక్రమణలు కూడా చేసుకున్నందున వంటకాలవలోనికి వ్యర్ధాలను విడుదల చేసిన వారికి ఆక్రమణలకు పాల్పడిన వాళ్లందరికీ నోటీసులను జారీ చేయవలసినదిగా పంచాయతీ కార్యదర్శి సూచించడమైనది. భవిష్యత్తులో ఈ పంట కాలవను ఉపాధి హామీ పథకం ద్వారా బాగు చేసుకునే వీలు ఉంటుందని గ్రామస్తులకు తెలియజేయడమైనది. వంటకాలవలోనికి వ్యర్ధాలను విడుదల చేసే వారందరికీ ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్న ఇంకుడు గుంటల సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొని సహకరిస్తున్నందుకు గ్రామస్తులందరికీ ఎంపీడీవో వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేయడమైనది.