నవభారత్ న్యూస్......
పిహెచ్.డి పొందిన కోటేశ్వరిని అభినందించిన ఏకేయూ వి.సి, రిజిస్ట్రార్....
*************************
చదువుపై ఉన్న ఆసక్తితో అంచలంచెలుగా ఎదిగి గణిత శాస్త్రంలో పిహెచ్.డి పొందిన ఏ.కే.యూ అతిథి అధ్యాపకురాలు కట్టా కోటేశ్వరిని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు తదితరులు హృదయ పూర్వకంగా అభినందించారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ లోని మ్యాథ్స్ విభాగం నందు అతిథి అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న కట్టా.కోటేశ్వరి ఇటీవల కృష్ణా యూనివర్శిటీ నుంచి మ్యాథ్స్ విభాగంలో పిహెచ్.డి పొందారు. కృష్ణా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఏ.మదన్ మోహన్ రావు పర్యవేక్షణలో ఆమె " సం జనరల్ సొల్యూషన్స్ ఆఫ్ సర్ జార్జి స్ట్రోక్స్,ఆల్బెర్ట్ బ్రింక్మెన్ అండ్ ఒసీన్ ఈక్వేషన్స్" అనే అంశం మీద తన పరిశోధనను పూర్తి చేసింది. కోటేశ్వరి సమర్పించిన పరిశోధనా గ్రంధాన్ని పరిశీలించిన కృష్ణా యూనివర్శిటీ ఉన్నతాధికారులు ఆమెకు ఇటీవల ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ డాక్టర్ జి.నానాజీ రావు ఆద్వర్యంలో వైవాను నిర్వహించి డాక్టరేట్ డిగ్రీని అందజేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆంధ్రకేసరి యూనివర్శిటీ వి.సి ఛాంబర్ నందు జరిగిన అభినందన కార్యక్రమంలో డాక్టరేట్ డిగ్రీ పొందిన కోటేశ్వరిని వి.సి.ప్రొఫెసర్ మూర్తి తోబాటు ఆంధ్ర కేసరి యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు, ఏ.కే.యూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కే.వి.ఎన్.రాజు,ఏ.కే.యూ మ్యాథ్స్ విభాగం హెచ్.ఓ.డి డాక్టర్ కే గంగాధర్ తోబాటు సహచర అధ్యాపకులు డాక్టర్ జడ అరుణ్ కుమార్, డాక్టర్ లేతవడ్ల కృష్ణ, డాక్టర్ ఎన్.ఎస్.ఎల్.వి.నరసింహా రావు తదితరులు అభినందనలు తెలిపారు..