నవభారత్ న్యూస్........
జోగిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
తెరాస నాయకుడిపై
డాక్యూమెంట్ లపై అధికారుల దొంగ సంతకాలు చేసి అక్రమాలకు పాల్పడినందుకు
ఫోర్జరీ మరియు చీటింగ్ కేసు నమోదు
రిమాండ్ చేసిన జోగిపేట పోలీసులు
నవభారత్ న్యూస్ ప్రతినిధి రవి......
అందోల్ మండల్ జోగిపేట్
Crime No. 254/2024 U/s. 338, 318(4), 335, 336(3), 340(2) BNS OF JOGIPET PS.
ఫిర్యాది : మధుకర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ అందోల్ మండల్
నేరస్తుడు :
జోగిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
తెరాస నాయకుడు
డాకూరి బుడల నాగభూషణం తండ్రి పోచయ్య, వ, 54 స, లు కులం: ముదిరాజ్, గ్రా,, అందోల్ & మండల్,
కేసు ముఖ్య విషయం ఏమనగా నేరస్తుడైన బుడల నాగభూషణం వయసు 54 సంవత్సరాలు కులం ముదిరాజ్ గ్రామం ఆందోల్ అను అతను నేరపురితమైన కాంక్షతో అతని అన్నయ్య బుడల రాములు పేరుమీద ఉన్న సర్వ్యే No. 218 పక్కన గల సర్వ్యే No 217 లో రెండు ఎకరాల 2 . 11 గుంటల భూమిని దురుద్దేశంతో అతని అన్న రాములు తేదీ 15.09.2023 నాడు చనిపోయినాడు, కానీ నేరస్తుడు బుడల నాగభూషణం అతని అన్న రాములు పేరుమీద తేదీ 01.04.2024 నాడు ధరణి పోర్టల్ లో పాస్ బుక్ కరప్షన్ పెట్టుకున్నారు అట్టి ధరణిలో పెట్టిన అప్లికేషన్ను తాసిల్దార్ గారు పరిశీలించి అందులో పెట్టిన ఫోన్ నెంబర్ 9440489064 కి నేరస్థుడు అయినా బుడాల నాగభూషణం దానికి రెస్పాండ్ అయినాడు . దానికి తహసీల్దార్ గారు సంబందించిన రైతు వారి పట్టా ధ్రువపత్రం సబ్మిట్ చేయమనగా. అందుకు నేరస్థుడు తప్పుడు రైతు వారి పట్టా ధ్రువపత్రం తయారుచేసి సంతకం కోసం గెజిటెడ్, అతని అన్న మరణ ధ్రువపత్రంపై శ్రీకాంత్ అనే ప్రొఫెసర్ యొక్క గెజిటెడ్ సంతకం తీసుకొని అట్టి సంతకం మరియు స్టాంప్ ను ఫోన్లో క్రాప్ చేసి అదే సంతకం మరియు స్టాప్ ను కలర్ ప్రింట్ చేసి రైతు వారి పట్టా ధ్రువపత్రం పై కాపీ చేసి నిజమైన రైతు వారి పట్టా ధ్రువపత్రం ముగా సబ్మిట్ చేసినాడు అని ఫిర్యాది అయినా డిప్యూటీ తాసిల్దారు గారు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయనైనది.