" జూదం ,అక్రమ ఇసుక రవాణా, సైబర్ క్రైం వంటి మోసాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమం."

NavaBharath News Kandukur
0


నవభారత్ న్యూస్.......

జూదం ,అక్రమ ఇసుక రవాణా, సైబర్ క్రైం వంటి మోసాల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమం."

గుడ్లూరు నవంబర్-22(నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి.హెచ్. ఆంజనేయులు) 

గుడ్లూరు మండల కేంద్రంలో శుక్రవారం జూదం ,అక్రమ ఇసుక రవాణ,సైబర్ క్రైం మోసాల పై మండల అధికారులు ప్రజలను అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో గుడ్లూరు తహసీల్దార్ శ్రీమతి జి. స్వర్ణ మాట్లాడుతూ మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు .మండలంలో ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన ఇసుక రీచ్ ల నుంచి మాత్రమే ఇసుకను అవసరమైన వారు తెచ్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు ఎస్సై వి. వెంకట్రావు మాట్లాడుతూ గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు ,పేకాట మరియు ఇతర జోధ కార్యక్రమాలకు పాల్పడుతూ వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ మండల పరిధిలో గ్రామాల్లో యువత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ తెలియజేశారు. అలాగే ప్రస్తుతం సాంకేతిక పరంగా ఆన్లైన్ మోసాలకు గురి చేసే గేమింగ్స్ జూదాలకు సంబంధించి ప్రజలు , యువత అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. మంగారావు మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాల సైబర్ క్రైమ్స్ పట్ల జరుగుతున్న మోసాలను తెలుసుకోవలసినటువంటి అవసరం ప్రజలకు ఎంతైనా ఉన్నదని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్పటివరకు జరుగుతున్న సైబర్ క్రైమ్స్ దొంగతనాల గురించి,మోసాల గురించి వివరించారు. ఆన్లైన్లో వాట్సాప్ లో ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్ ,ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సాంకేతిక మాధ్యమాలలో వచ్చేటటువంటి తెలియనటువంటి గ్రూపులలో జాయిన్ అయి,అన్నొన్ వెబ్సైట్లు ఓపెన్ చేసి ,లైక్ చేసి హ్యాకింగ్ కి గురికావద్దంటూ పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు .ఇటువంటి మోసాలు మీ దృష్టిలోకి వచ్చిన ఒకవేళ మీరే బాధితులైన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేదా పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లకు 1903కి లేదా ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ ద్వారా సమాచారం అందజేయగలరని ఈ సందర్భంగా గుడ్లూరు సిఐ జి. మంగరావు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టారు అలాగే ప్రస్తుతం మన మండల పరిధిలో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో జూదం, కోడిపందాలు ,పేకాట ,ఆన్లైన్ గేమింగ్స్ వంటి వాటితో మోసపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం వారు ఉచితంగా ఇసుకను వాడుకునే అవకాశం ప్రజలకు కల్పించినప్పటికీ,కొందరు దానిని వ్యాపారంగా మార్చి అక్రమంగా ఇసుక వ్యాపారులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భారీ వాహనాలలో ఎక్కువ మోతాదులో ఇసుకను తరలిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు గమనించిన ప్రజలు వెంటనే గుడ్లూరు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగలరని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో గుడ్లూరు ఎంపీడీవో వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు చట్టపరంగా ప్రభుత్వ అధికారులు తెలిపినటువంటి ఆదేశాలను వెంటనే అమలు జరిగే విధంగా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు తహసిల్దారు శ్రీమతి జి. స్వర్ణ , గుడ్లూరు ఎంపీడీవో వై. వెంకటేశ్వరరావు , గుడ్లూరు సిఐ జి. మంగారావు గుడ్లూరు ఎస్సై బి. వెంకట్రావు, గుడ్లూరు మండల హౌసింగ్ ఏఈ కే .వెంకటేశ్వర్లు పాల్గొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న జూదాల గురించి అక్రమ ఇసుక రవాణా గురించి సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top