నవభారత్ న్యూస్......
రావూరు, చేవూరులో "పొలం బడి కార్యక్రమం
." గుడ్లూరు నవంబర్-22(నవభారత్ న్యూస్ గుడ్లూరు ప్రతినిధి సి.హెచ్. ఆంజనేయులు)
గుడ్లూరు మండల పరిధిలోని చేవూరు , రావూరు రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి బి. రవికుమార్ అధ్యక్షతన పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాలు పొలం పిలుస్తోంది, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమం
ఈకార్యక్రమంలో రూట్ డిప్పింగ్ మెథోడ్ (మందు ద్రావణంలో వేరు ముంచు పద్దతి ) యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ నారు పీకడానికి ముందుగా పొలములో ఒక చివర నారుమడికి దగ్గర 5 x 5 కొలతలతో ఒక మడిని తయారుచేసుకొని అందులో ఒక అంగుళం వరకు నీరు వుండేవిదముగా నీరుపోసుకొని లీటరు నీటికి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడీ పొడి మందును నీటిలో కలుపుకొని నారు పీకి కట్టలు కట్టలుగా కట్టిన వెంటనే ఆద్రావనంలో నారు కట్టలు వేర్లు మునిగేవిధముగా అరగంట నుండి గంట వరకు ఉంచి నాటినయడల వేరును లేదా వేరును ఆశించే తెగుళ్ళ బారినుండి సమర్దవంతంగా పంటను కాపాడుకొనవచ్చునని వివరించారు .
ఈకార్యక్రమములో గ్రామ నాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు షారుక్ ఖాన్, శైలజ మరియు రైతులు పాల్గొన్నారు.