ప్రియాంకా గాంధీ వయనాడ్ యం.పి గా నాలుగు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ తో అఖండ విజయం సాధించడం

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్......

ప్రియాంకా గాంధీ వయనాడ్


యం.పి గా నాలుగు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ తో అఖండ విజయం సాధించడం 

అభినందనీయం--- 


గడ్డం పాల్ విజయ కుమార్,


పిసిసి ప్రధాన కార్యదర్శి.

........................................

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంకా గాంధీ వాద్రా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటిగా వయనాడ్

లోకసభ ఉప ఎన్నికలలో పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ తో గెలుపొందటం దేశంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు నూతన బలాన్ని ఉత్తేజాన్ని ఇచ్చినదని

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయ కుమార్ అన్నారు. శనివారం

ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లో మెజారిటీ తో కొనసాగిన ప్రియాంకా గాంధీ తన అన్న, వయనాడ్ మాజీ యం.పి.

రాహుల్ గాంధీ కన్న. ఎక్కువ మెజారిటీ తో గెలుపొండటం దేశంలో కాంగ్రెస్ పార్టీ కీ ఇప్పటి కీ ఎంతో ఆదరణ

 ఉన్న దని చెప్పటానికి నిదర్శనమని పాల్ అన్నారు.రానున్న రోజులలో

ప్రతి రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొంది రాహుల్ గాంధీ నీ ప్రధానిని చేయటానికి

అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధులై

ఉన్నారని తెలిపారు. గత పది సంవత్సరములకు పైగా కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రజా వ్యత్తిరేక పాలనకు అన్నివర్గాల ప్రజలు విసుగెత్తి పోయారని పాల్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే , కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, నూతనంగా యం పి గా ఎన్నుకోబడిన ప్రియాంకా గాంధీ , ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు

రాజ్య సభ, లోక్ సభ లలో తమ వాణిని సమర్ధవంతంగా

వినిపించి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడ తారని పిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top