నవభారత్ న్యూస్........
బాలికలు చదువుకుని ఎదగాలి..
నవభారత్ న్యూస్ ప్రతినిధి మోజెష్....
2సెక్టార్ కొండసముద్రం లో సీడీపీఓ శారద సూచనల మేరకు సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో బాల్యవివాహల పై అవగాహన సదస్సు కార్యక్రమం శనివారం జరిగిoది . ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ18సంవత్సరాలు పూర్తయున తర్వాత వివాహం చేసినట్లయితే వారిలో శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉంటుందన్నారు. 18సంవత్సరాల లోపు వివాహం చేయకూడదని తక్కువ వయస్సులో వివాహం చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయనీ పేర్కొన్నారు. కిశోర బాలికలు సరైన అవగాహన కలిగివుండాలని చెప్పారు. మోసపోరితమైన మాటలను వినకూడదన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని తెలియచేసారు. ఆడపిల్లలు బడి మాని వేయడాన్ని పూర్తిగా అరికట్టాలని అందరూ బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలనిసూచించారు. ఈ కార్యక్రమం లో స్కూల్ హెచ్ఎం కె పాల్ జాన్సన్, టీచర్స్ కె రవికుమార్, షేక్ ఎస్.కె రేష్మ , అంగన్వాడి కార్యకర్త శిరోమణి, శిరీష ఆయా పద్మ, నయోమి పాల్గొన్నారు.