నవభారత్ న్యూస్.......
నవభారత్ న్యూస్ ప్రతినిధి రవి..
అందోల్ -జోగిపేట మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి పనులు ప్రారంభం.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కృషితో అందోల్ జోగిపేట మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. జోగినాథ ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న తహసిల్దార్ వసతి గృహం వద్ద ఈ నూతన మున్సిపల్ భవనాన్ని నిర్మాణం చేపడుతున్నారు. రూ. 6 కోట్లతో మోడల్ మున్సిపాలిటీ భవనాన్ని నిర్మాణం చేపడుతున్నారు. భవన నిర్మాణం చేపట్టేందుకు శుక్రవారం పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న వసతి గృహాన్ని జెసిబి సహాయంతో తొలగించ చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో
1 వార్డ్ కౌన్సిలర్ డాకూరి శివశంకర్ , కాంగ్రెస్ నాయకులు మోసిం భాయ్, పిట్ల లక్ష్మణ్, నాగరాజు (చిన్న) జశ్వంత్ బీజేపీ నాయకులు ఉలవల వెంకటేశం , మున్సిపల్ ఏఈఈ శ్రీకాంత్ , వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ మరియు మున్సిపల్ సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు.