ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ మెజర్స్‌పై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్షించారు.*

NavaBharath News Kandukur
0


 

నవభారత్ న్యూస్.......

*నవభారత్ న్యూస్ ప్రతినిధి   రవి.*


ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ మెజర్స్‌పై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్షించారు.*


*శనివారం ఉదయం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.*


*ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని ఓ దవాఖానలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం అని మంత్రి పేర్కొన్నారు.*


*రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అదికారులను మంత్రి ఆదేశించారు.*


*ప్రభుత్వ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి, నివేదిక తయారు చేయాలని సూచించారు.* 


*తనిఖీల కోసం వెంటనే పది బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.*


*ఈ బృందాలు తొలుత గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు.*


*ఫైర్ అలార్మ్స్‌, స్మోక్ట్ డిటెక్టర్స్‌ ఉన్నదీ, లేనిది పరిశీలించాలన్నారు.*


*మంటలను ఆర్పే యంత్రాలు సరిపడా ఉన్నాయో? లేవో చూడాలని, వాటి తుది గడువు తేదీలను చెక్ చేయాలని సూచించారు.*


*ఫైర్ సేఫ్టీ, మంటలను ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటళ్లలో పనిచేసే సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు.*


*హాస్పిటళ్లలో పవర్ సప్లై సిస్టమ్‌ను పరిశీలించాలని, పాత ఎలక్ట్రిక్‌ కేబుల్స్‌ ఉంటే, వాటి స్థానంలో, నాణ్యమైన కొత్త కేబుల్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.*


*ఫైర్ సేఫ్టీ, షార్ట్‌ సర్క్యూట్‌కు సంబంధించి Do's, Don’ts sign boards ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.*


*హాస్పిటల్‌కు సమీపంలోని ఫైర్ స్టేషన్‌ సిబ్బందితో హాస్పిటల్ అధికారులు టచ్‌లో ఉండాలని, హాస్పిటల్స్‌లో రెగ్యులర్‌గా ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని ఆదేశించారు.*


*ప్రతి హాస్పిటల్‌కు fire evacuation plan ప్లాన్ రూపొందించాలని, ఆ ప్లాన్‌పై డాక్టర్లు, స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.*


*fire evacuation ప్లాన్‌కు సంబంధించిన సైన్ బోర్డులను హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయాలన్నారు.*

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top